వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పార్టీ అధిష్టానం కూడా రఘురామకృష్ణంరాజు కి ఆయన వ్యవహరిస్తున్న తీరుకి గట్టిగానే షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇటువంటి తరుణంలో సొంత జిల్లాకు చెందిన నేతలను మరియు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులను కూడా రఘురామకృష్ణంరాజు వదలకుండా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో రఘురామకృష్ణంరాజు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జగన్ నేతృత్వంలో పార్టీ పెద్దలు పోరాడుతున్నారు. మరోపక్క రఘురామకృష్ణంరాజు బీజేపీ పార్టీకి దగ్గర అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు.

IHG

ఇదే తరుణంలో విజయవాడ పార్లమెంటు నుండి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసినా పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ కూడా ఇటీవల బిజెపికి దగ్గరవుతూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పై వేటు వేస్తే  పార్టీలో మిగతా నేతల ని కంట్రోల్ చేయాలని జగన్  అండ్ కో భావిస్తున్నా, మిగతా నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని తిరుగుబాటు సెగలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే అవకాశం ఎక్కడా కనబడటం లేదని మేధావులు అంటున్నారు.

IHG

చాలావరకు వైసీపీ పార్టీలో మంత్రులకు ఎంపీలకు జగన్ వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదని, కానీ ప్రస్తుతం బయట పడటం లేదన టాక్ గట్టిగా వినబడుతుంది. ఎక్కువగా వైయస్ జగన్ తన పరిపాలన మొత్తం ప్రజలకు తనకి అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి విషయాలు కూడా వైఎస్ జగన్ కి చెప్పుకోలేని పరిస్థితి ఉండటంతో చాలామంది జగన్ తీరుపై అసహనంగా  ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీలో నాయకుల తీరు ఇలా ఉంటే సామాన్య ప్రజలు అదేవిధంగా ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు జగన్ మంచి పరిపాలన అందిస్తున్నాడని చెప్పటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: