ప్రపంచంలోనే రెండో పురాతనమైన తిరుగుబాటు సంస్థగా నాగాకు పేరుంది. నాగాలతో 23 సంవత్సరాలుగా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ సరైన పరిష్కారం మాత్రం లభించలేదు. సమీప భవిష్యత్తులో చర్చల్లో పురోగతి లభిస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లడం వల్ల నాగాల్లో తీవ్ర నిరాశ నెలకొంది.నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్​(ఎన్ఎస్​సీఎన్​-ఐఎం)కు చెందిన సాయుధ బలగాలు తమ ఆయుధ సామగ్రితో భారత్​ను విడిచి వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మయన్మార్​లో కొత్త శిబిరాలు ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

2015లో ప్రభుత్వానికి, ఎన్ఎస్​సీఎన్​కు మధ్య ఫ్రేమ్​వర్క్​ ఒప్పందం కుదిరినప్పుడు సమస్య పరిష్కారమవుతుందన్న ఆశలు చిగురించాయి. అయితే తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల భారత ప్రభుత్వంపై నాగాలకు విశ్వాసం సన్నగిల్లింది. మరోవైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న చైనాకు సంఘీభావంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 2 వేల మంది నాగాలు మణిపుర్​లోని ఉఖ్రుల్​ ప్రాంతంలో సంగీత కచేరీ నిర్వహించారు. ఇది భారత్​కు హెచ్చరిక లాంటిది.ఈశాన్యంలోని నాలుగు రాష్ట్రాల్లో నాగా తిరుగుబాటుదారులు విస్తరించి ఉన్నారు. ఈ ఉద్యమం ద్వారా లబ్ధి పొందినవారిలో చైనా ఒకటి. నాగా తొలి తరం తిరుగుబాటుదారుల్లో కొంత మంది చైనాలోనే ఆయుధ శిక్షణ పొందారు. సహాయం అందించాలని చైనాను సంప్రదించారు.

 

 

భారత్​తో ప్రత్యక్షంగా తలపడలేమని తెలిసే... పాకిస్థాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోంది. వీరిని ఉపయోగించుకొని భారత్​లో సంఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఇప్పుడు చైనా సైతం ఇదే దారిలో వెళ్తోందా? భారత్​తో ఉద్రిక్తతలు రాజేసి భంగపడిన డ్రాగన్ దేశం.. తిరుగుబాటుదారులను ఆశ్రయిస్తోందా? ఎప్పటినుంచో భారత్​లోని తిరుగుబాటు సంస్థలకు పరోక్షంగా సాయం చేస్తున్న చైనా ఇప్పుడు మరింత బరితెగిస్తోందా?ఈశాన్య రాష్ట్రాల్లో మణిపుర్​లోనే అత్యధిక(సుమారు 50 వరకు) తిరుగుబాటు సంస్థలున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల తిరుగుబాటు దళాల్లో చేరడమే ఇక్కడి యువతకు జీవన విధానంగా మారింది. మెయిటీ వంటి శక్తిమంతమైన తిరుగుబాటు సంస్థలు కమ్యూనిస్టు భావజాలాన్నే పాటిస్తున్న నేపథ్యంలో చైనాతో పొత్తుపెట్టుకోవడం సర్వసాధారణమే. ఈ సంస్థలకు చైనా నుంచి విస్తృత సహకారం లభించింది. ఈ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది చైనా తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: