భారత చిరకాల మిత్ర దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది రష్యా దేశం అని చాలామంది చెబుతారు. ఆయుధ సామాగ్రి లో భారత్ కి ఎప్పటినుండో రష్యా పెద్ద ఎత్తున దిగుమతి చేస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో అంతర్జాతీయ సదస్సులలో ఇండియాకి అండగా నిలబడిన ఏకైక దేశం రష్యా. అటువంటిది ప్రస్తుతం ఇండియా కరోనా వైరస్ విషయంలో అదే విధంగా చైనా తో తలపడే విషయంలో అద్భుత రీతిలో పోరాటంతో రాణిస్తున్న తరుణంలో ఒకపక్క అమెరికా... ఇండియా కి అండగా నిలవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఏ మాత్రం రష్యా కి ఇష్టం లేదు. ఇటువంటి తరుణంలో రష్యా ఇండియా కోసం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కీలక విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. యునైటెడ్ సెక్యూరిటీ పర్మినెంట్ సీటు కోసం ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న ఇండియాకు రష్యా ఇటీవల పూర్తి మద్దతు తెలిపింది.

 

ఎప్పటినుండో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా రాకూడదని చైనా అడ్డుపడుతోంది. ఇలాంటి తరుణంలో ఇటీవల మూడు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా చైనా ముందే ఇండియా కి మద్దతు తెలపడం డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చినట్లయింది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్ కి అన్ని అర్హతలు ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల పేర్కొన్నారు. త్వరలోనే ఇండియా UNSC పర్మినెంట్ మెంబర్షిప్ పొందాలని రష్యా బలంగా కోరుకుంటుంది. రీసెంట్ గా ఇటీవల UNSC లోను పర్మినెంట్ మెంబర్షిప్ గా భారీ మెజార్టీతో ఇటీవల ఇండియా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మొత్తం 15 స్థానాలు ఉంటాయి. ఐదు పర్మినెంట్ స్థానాలు కాగా 10 నాన్ పర్మినెంట్ స్థానలు. ఈ నాన్ పర్మినెంట్ స్థానలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికైన జయశంకర్ రెండు సంవత్సరాలలో యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాకు పర్మినెంట్ స్థానం ఎందుకు కావాలో రుజువు చేసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో ఇండియాకి.... రష్యా అండగా నిలబడటంతో అంతర్జాతీయంగా UNSC పర్మినెంట్ మెంబర్ షిప్ విషయంలో భారత్ కోసం రష్యా బాగా కష్టపడుతుంది అని ప్రపంచ దేశాలు అంటున్నాయి. చైనా వివాదం విషయంలో భారత్ కి అండగా ఉండి ఆసియాలో చక్రం తిప్పాలని అమెరికా కుయుక్తుల పడుతున్న తరుణంలో… ఏమాత్రం ఇండియా అమెరికా కి దగ్గర కాకూడదని రష్యా తన మిత్ర బంధాన్ని ఈ విధంగా మద్దతు తెలుపుతూ గట్టి చేసుకుంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: