జర్నలిజం.. కొందరికి ఇది ఉద్యోగం.. మరికొందరికి వ్యాపకం.. కానీ కొందరికి మాత్రం ఇదే జీవితం.. ఇదే సర్వస్వం.. దీని తర్వాతే ఏదైనా.. అలాంటి ఓ అరుదైన జర్నలిస్టు గురించి ఇవాళ తెలుసుకుందాం.. ఆయనే జాన్ లీ అండర్సన్ ! అమెరికన్ జర్నలిస్టు.. జాన్ లీ ఆండర్సన్ ప్రతిష్టాత్మకమైన అమెరికా పత్రిక న్యూయార్కర్ రిపోర్టరు. రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, వార్ కరస్పాండెంట్ కూడా. 

 

 


జాన్‌లీ అండర్సన్‌ నిరంతర సత్వాన్వేషి.. ఎప్పుడూ ప్రపంచమంతా తిరగుతూనే ఉంటాడు.. వార్ జర్నలిజమంటే అతడికి పిచ్చి. అంతే కాదు.. దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, మిలిటరీ కమాండర్లు, ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు, నియంతలు, నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తుంటాడు.. వార్తలు, వ్యాసాలు, పుస్తకాలు రంతరం రాస్తూనే వుంటాడు. 

 


63 ఏళ్ల ఈ జర్నలిస్టు వస్తున్నాడంటే.. దేశాధ్యక్షులు కూడ రెడ్ కార్పెట్ స్వాగతం చెబుతారు. నియంతలు కూడా పూలగుత్తులతో స్వాగతం పలుకుతారు. ఇక ఈ జర్నలిస్టు తన జీవితంలో సాధించిన అనేక విజయాల్లో చాలా గొప్పది CHE: JON LEE ANDERSON అనే పుస్తకం రాయడం.. చేగువేరా జీవితంపై అండర్సన్ ఐదేళ్లు పరిశోధించి రాసిన ఈ పుస్తకం 
ప్రపంచ వ్యాప్తంగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 

IHG


ఈ పుస్తకం 1200 పేజీల గ్రంథం. విప్లవకారుడు చేగువేరా జీవితమ్మీద సాధికారికమైన, ప్రామాణికమైన గ్రంథం. ఈ పుస్తకం కోసం అండర్సన్ అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో నుంచి ప్రత్యేక అనుమతి పొంది... క్యూబా నేష‌న‌ల్ ఆర్కైవ్స్‌లో వుండే, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల‌తో స‌హా, మొత్తం స‌మాచారం, ఉత్తరాలు, ర‌హ‌స్య సందేశాలు సంపాదించాడు. ప్రపంచానికి అందించాడు. 

 

 

అంతేకాదు.. చే గురించి కొన్ని వందల మందిని ఇంటర్వ్యూలు చేసి.. చివరకు చేగువేరాను పాతిపెట్టిన స్థలాన్ని కూడా ప్రపంచానికి తెలియజేశాడు. 1979లో పెరూలోని `లిమా టైమ్స్‌`లో కేరీర్ ప్రారంభించిన ఈ జర్నలిస్టుకు ప‌త్రిక‌ల్లో ప‌నిచేయ‌డం క‌న్నా, పుస్తకాలు రాయ‌డ‌మే ఎక్కువ ఇష్టం. చిలీ న‌ర‌హంత‌క నియంత అగ‌స్టో పినోఛెట్‌, క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో, వెనిజులా యోధుడు హ్యూగో చావెజ్‌ల జీవిత క‌థ‌లు రాశాడు. 

 

 

ఆయన ఏమంటాడంటే.. “ సాహ‌స‌మే జీవితంగా బ‌త‌క‌డం నాకు యిష్టం. అలా బ‌తికే వాళ్లని ప్రేమిస్తాను. బ‌తుకంతా టేబుళ్ల ముందు క‌ర్చీల్లో కూర్చొని రాసే ర‌చ‌యిత‌ల‌ని నేను భ‌రించ‌లేను. వాళ్లని చూసి త‌ట్టుకోలేను. నేను ఎలా వుండాల‌నుకుంటున్నానో అలా వుండ‌డాన్నే యిష్టప‌డ‌తాను. “  గ్రేట్ కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: