దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు. ఇక మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ లో కేసులు బాగా పెరిగిపోతున్నాయి.

 

తాజాగా శనివారం నాడు ఎనిమిది లక్షల మార్క్‌ కూడా దాటేసింది. అన్‌లాక్ 1.0 తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాజస్థాన్‌లో ప్రస్తుతం 23 వేల మార్క్‌ దాటేసింది. శనివారం నాడు కొత్తగా మరో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,344కి చేరింది.  శనివారం నమోదైన కేసుల్లో అల్వార్‌లో 40, జైపూర్‌లో33, ఉదయ్‌పూర్‌లో31 వచ్చాయి.

 

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.బ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 499 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,211 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు

 


       

మరింత సమాచారం తెలుసుకోండి: