గత కొన్ని నెలల నుంచి చైనాకు శత్రుదేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందడంతో సహజంగానే ఆ దేశంపై పలు దేశాలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. భారత్ చైనా సరిహద్దు వివాదం సమయంలో ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు ఇవ్వడంతో పాటు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడిప్పుడే భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
చైనా బలగాలు సోమవారం నుంచి వెనక్కు వెళుతున్నాయి. పాంగ్ వాన్ సరస్సు మినహా మిగతా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. భారత్ తో పాటు చైనాకు ఇతర దేశాలతో కూడా వివాదాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న చైనా ఆకస్మికంగా వివాదాలు సృష్టిస్తూ ఉండటానికి కారణాలేమిటనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ విధంగా వివిధ దేశాల విషయంలో వ్యవహరిస్తూ ఉండటంపై అమెరికా, యూరప్ దేశాల విశ్లేషకులు ఇచ్చిన నివేదికల ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఆ నివేదికల్లో 2021 డిసెంబర్ లోపు జిన్ పింగ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతే పదవి కోల్పోవాల్సి వస్తుందని సమాచారం. 2021లో చైనా ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలు జరిగేనాటికి ఒకప్పటి చైనా చక్రవర్తుల కాలం నాటి భూభాగాన్ని ఏకం చేస్తానంటూ జిన్ పింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చైనాలో జిన్ పింగ్ ను అభిమానించేవాళ్లు, వ్యతిరేకులు ఏకమవుతున్నారు. 
 
గతంలో పార్టీ నేతలు ఇతర దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు అంగీకారం తెలపలేదు. అయినా జిన్ పింగ్ పలు దేశాలను చైనాలో కలుపుకోవాలని పెద్ద ఎత్తున నిధులను ఇతర దేశాలకు ఇచ్చారు. కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా వృద్ధిరేటు భారీగా పడిపోయింది. ఉపాధి అవకాశాలు కరువై యువతలో తిరుగుబాటు వస్తోంది. దీంతో ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించి చైనాలో జిన్ పింగ్ గద్దె దిగకుండా పార్టీలో, ప్రజల్లో మద్దతు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: