దేశంలో కరోనా మహమ్మారి ప్రతిరోజూ విజృంభిస్తుంది.  దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఈ మద్యనే లాక్ డౌన్ సడలిస్తున్నారు. దాంతో రోడ్లపై ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు తిరుగుతున్నాయి. కానీ ప్రయాణీకులు మాత్రం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ముంబయి రోడ్లపై పరుగులు తీసే ఓ ఆటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 

మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సైతం ఈ ఆటోను చూసి ముగ్ధుడయ్యారు. ఈ ఆటో యజమాని పేరు సత్యవాణ్ గైట్. ఈయన మొదటి నుంచి ప్రజా సేవ చేయడంలో ముందు ఉంటూ వస్తున్నారు. తనకు తగ్గ సాయం అందిస్తూ.. అందరిచే మంచోడు అనిపించుకుంటున్నారు. ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకే ఇప్పటివరకు అవసరాలకు తగిన విధంగా, ప్రజల క్షేమాన్ని కోరి తన ఆటోను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు.  ఈ ఆటోలో ఎక్కే ప్రయాణికులు శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా చిన్న వాష్ బేసిన్, శానిటైజర్లు, హ్యాండ్ వాష్, మినీ వాటర్ ట్యాంక్ ఉన్నాయి.

 

పర్యావరణ హితం కోరుకుంటూ సత్యవాణ్ గైట్ కొన్ని మొక్కలకు కూడా తన ఆటోలో చోటు కల్పించాడు. పొడి చెత్త, తడి చెత్త వేసేందుకు రెండు వేర్వేరు డస్ట్ బిన్లు కూడా ఇందులో ఉన్నాయి.  అంతే కాదు ఈ ఆటోలో.. ఫై సౌకర్యం, ఓ చిన్న టీవీ, బ్లూటూత్ కనెక్షన్ లో స్పీకర్, మంచినీళ్లు, కూలింగ్ ఫ్యాన్ ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఆటోకు వెలుపల భాగంలో స్వచ్ఛ భారత్ ప్రచారానికి సంబంధించిన వాక్యాలు దర్శనిమిస్తాయి. ఇక తన ఆటోలో వృద్దులను కడూ ఫ్రీగా తరలిస్తుంటారట..ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: