ప్రపంచ దేశాలు ఒకవైపు ఉంటే చైనా మాత్రం మరోవైపు ఉంది. గత కొన్ని నెలలుగా చైనా ప్రపంచ దేశాలతో అనవసర వివాదాలు సృష్టించుకుంటోంది. కొన్ని రోజుల క్రితం రష్యాలో ఉత్సవాలు జరిగిన ప్రదేశం తనదేనని చైనా చెప్పుకొచ్చింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు చైనా పాలకుల ధోరణి ఎలా ఉందో ప్రజల ధోరణి కూడా అదే విధంగా ఉందని తెలుస్తోంది. అక్కడి ప్రజల్లో విస్తరణ వాద కాంక్ష ఎక్కువగా ఉంది. 
 
చైనా చక్రవర్తుల కాలం నాటి భూభాగమంతా తమదేనని... ఇతర దేశాలు తమ దేశ భూభాగాలను ఆక్రమించాయని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తాజాగా చైనా సోషల్ మీడియా వెబ్ సైట్ వివోలోలో రష్యన్ రాయబారి కార్యాలయం పోస్ట్ చేసినటువంటి బ్లాడివోస్టోక్ 160వ వార్షికోత్సవంను చైనీయులు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తమ దేశపు భూభాగంలో రష్యా ఉత్సవాలు నిర్వహించిందని కామెంట్లు చేస్తున్నారు. 
 
చైనా దౌత్యవేత్తలు, అధికారులు, ఇంటర్నెట్ వినియోగదారులు రష్యా ఉత్సవాలు జరిగిన ప్రాంతం తమ భూభాగమని... ఇది ఒకప్పటి తమ మాతృ భూమి అని... రెండవ నల్లమందు యుద్ధంలో చైనాను బ్రిటిష్, ఫ్రెంచ్ ఓడించిన సమయంలో రష్యన్ సామ్రాజ్యం ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుందని  చెబుతున్నారు. చైనాలోని టీవీ ఛానెళ్లలో ఇదే తరహా ప్రచారం సాగుతుండటం గమనార్హం. 
 
చైనా ప్రాంత యువత ప్రస్తుతం పెద్దఎత్తున రష్యాలో ఉత్సవాలు జరిగిన ప్రాంతం తమ నగరమని పాలకుల తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనీయులు మ్యాపుల్లో కూడా ఆ ప్రాంతాన్ని తమదేనని పేర్కొన్నారు. చైనా టిబెట్, నేపాల్, భారత్, రష్యాలోని భూభాగాలు తమవేనని చెబుతోంది. అలా అయితే చైనా ఇప్పటివరకు ఆక్రమించిన భూభాగాలన్నీ ప్రపంచ దేశాల నుంచి ఏదో ఒక సందర్భంలో తీసుకున్నవే. చైనా ప్రజలు కూడా పాలకుల ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: