కరోనా పేరు చెబితేనే ఇప్పుడు వణికిపోతున్నారు. ఎటు చూసినా కరోనా వార్తలే. వాటిలో చాలా వరకూ నెగిటివ్ వార్తలే. కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అలాంటిదే.. దేశంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా వ్యాప్తిని బాగా నిలువరిస్తున్నారు. ఇక్కడి కరోనా విజయగాధ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. 

 

IHG's ...


ఇక్కడ కరోనాను బాగా కట్టడి చేస్తున్నారంటూ ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకుంది. కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలమనడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని అందులో ధారావి ప్రముఖమైందని ఆ సంస్థ  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మెచ్చుకున్నారు. కరోనాను జయించింది  ఇటలీ, స్పెయిన్ , దక్షిణ కొరియాల జాబితాలో ఆయన ధారావిని కూడా చేర్చారు. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a> over COVID-19


మరి ఇంతకీ ఈ విజయం ఎలా సాధ్యమైంది.. కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించడం, భౌతిక దూరం పాటించడం.. వ్యాధి సోకిన వారికి తక్షణమే చికిత్స అందించడమే ఇందుకు కారణం. ఈ కారణంగానే కరోనా యుద్ధంలో ధారావి విజయం సాధించింది. జూన్  కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ధారావిలో జులై నెలలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. 

 


ధారావిలో.... కరోనా కట్టడికి చేసిన ప్రయత్నాల కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతం ఈ ప్రాణాంతక వైరస్  నుంచి బయటపడే దశలో ఉంది. సంఘీభావంతో మాత్రమే  కరోనా మహమ్మారిని నివారించవచ్చని మన ధారావి నిరూపించింది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. గ్రేట్ ధారావి. 

మరింత సమాచారం తెలుసుకోండి: