దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఇటీవల రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా... నాలో నాతో వైఎస్సార్ అనే పేరుతో ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో వైయస్సార్ తో జీవితంలోని ఎన్నో ముఖ్య విషయాలను రాశారు విజయమ్మ, అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైయస్సార్ అనే పుస్తకం కేవలం ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ పుస్తకాన్ని చదివేందుకు  ఎంతోమంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ పుస్తకానికి సంబంధించిన కాపీలన్ని  అమ్ముడుపోయినట్లు సమాచారం.



ఇదిలా ఉంటే తాజాగా  సోషల్ మీడియాలో వైయస్ విజయమ్మ రాసిన నాలో నాతో అనే పుస్తకానికి సంబంధించి ఒక పిడిఎఫ్ ఫైల్ ప్రత్యక్షమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది నెటిజన్లు పిడిఎఫ్ ఫైల్ చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే తాజాగా ఈ పిడిఎఫ్ ఫైల్ గురించి ఒక నిజం బయటపడింది, ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పిడిఎఫ్ ఫైల్ వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకానికి సంబంధించింది కాదని... ఇదంతా ఫేక్ అంటూ వై.వి.సుబ్బారెడ్డి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు,



కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ ఫేక్  పిడిఎఫ్ ఫైల్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు వై.వి.సుబ్బారెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పిడిఎఫ్ ఫైల్ లో ఉన్న అంశాలు.   వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఉన్న అంశాలు పూర్తిగా వేరు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం ఎమెస్కో పబ్లికేషన్స్ ముద్రించిన నాలో నాతో వైయస్సార్ అనే పుస్తకం మాత్రమే నిజమైందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పిడిఎఫ్ ఫైల్ మొత్తం ఫేక్ అంటూ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇలా దురుద్దేశంతో వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకం పేరుతో ఫేక్ పిడిఎఫ్ ఫైల్ ని  సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు చర్యలు తీసుకోవాలని డిజిపికి ఫిర్యాదు చేసినట్లు వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: