ఓవైపు కరోనా ఎక్కడ వస్తుందో అన్న భయం.. మరోవైపు.. కరోనా వస్తే చాలు రోగుల్నీ ఆర్థికంగా దోచేస్తున్నప్రైవేటు ఆసుపత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు బతికేదెలా.. కరోనా వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా.. అన్న భయాందోళనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భయం అవసరం లేదు.. 

 

IHG


ఎందుకంటే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ  రెండు సార్వత్రిక బీమా పాలసీలను రూపొందించాయి.  నిబంధనలు విడుదల చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు  కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌  పేర్లతో పాలసీలను  తీసుకురావాలని ఇప్పటికే సూచించింది. అందుకు అనుగుణంగా హెడ్‌డీఎఫ్సీ ఎర్గో జనరల్  ఇన్సూరెన్స్‌, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్‌ సహా 30 బీమా సంస్థలు  పాలసీలతో ముందుకొచ్చాయి. 

 


వీటిని కరోనా కవచ్‌ పేరుతో పాలసీలను విడుదల చేశాయి. ఇక వీటి రూల్స్ ఏంటంటే..  కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పాలసీలను తీసుకునేందుకు  18 నుంచి 65 ఏళ్ల మధ్య వారు అర్హులు. వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీగానూ అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకునేందుకు ఎలాంటి ముందస్తు పరీక్షలు అవసరం లేదు.

 

IHG


ఇక ఈ పాలసీలు. మూడున్నర నెలలు , ఆరున్నర నెలలు  , తొమ్మిదిన్నర నెలలు వ్యవధికి అందుబాటులో ఉంటాయి. అయితే వ్యవధి తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు. మరి ఇంకేం మీరు కూడా ఈ పాలసీలు తీసుకోండి. కాస్త మనశ్శాంతిగా ఉండండి..

మరింత సమాచారం తెలుసుకోండి: