కరోనా వైరస్ కు చైనాయే కారణమంటూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.. తాజాగా చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ముస్లిం మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆ దేశానికి చెందిన కొందరు రాజకీయ నాయకులపై అమెరికా ఆంక్షలు విధించింది. 

 

IHG


వీగర్ ముస్లింలు, మరికొన్ని వర్గాలను సామూహికంగా నిర్బంధించి వారిపై మతపరమైన హింసకు పాల్పడటం సహా బలవంతంగా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయిస్తోందని చైనాపై ఆరోపణలున్నాయి. రీజనల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత చెన్ క్యుయాంగో, మరో ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించారు. 

 

IHG


ఐతే జిన్ జియాంగ్ లో వీగర్ల పట్ల అలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదంటూ చైనా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా జిన్ జియాంగ్ లో విద్యా శిబిరాల పేరుతో సుమారు 10 లక్షల మందిని అధికారులు నిర్బంధించినట్లు ఆరోపణలున్నాయి. తీవ్రవాదం, వేర్పాటువాదాలను అరికట్టేందుకు వొకేషనల్ ట్రైనింగ్ అవసరమంటూ ఈ నిర్బంధ శిబిరాలకు లక్షల మందిని తరలించారు. 

 

IHG'European naivety' as Trump's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHINA' target='_blank' title='china-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>china</a> pushback goes global ...


చైనా కమ్యూనిస్ట్ పార్టీలో శక్తిమంతమైన పొలిట్ బ్యూరో సభ్యుడు చెన్ క్యుయాంగో. ఇప్పటివరకు అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొన్నవారిలో అత్యున్నత స్థాయి అధికారి ఈయనేనని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: