వైఎస్సార్ దుర్మరణం తలచుకుంటే ఏడుపు వస్తుంది. ఆయన జీవితం అంతా పోరాటమే. అరవయ్యేళ్లకు రెండవ సారి కూడా  సీఎం గా గెలిచారు. ఆయన తన పాలనతో ప్రజలను మరికాస్తా మేలు చేసి ఇక రిటైర్ అవుదామనున్నారు కానీ విధి మరోలా తలచింది. ఇలా గెలిచి పగ్గాలు అందుకున్నారో లేదో అలా ఆయన్ని తీసుకుపోయింది.

 

ఇది తలచుకున్న వారికి కన్నీరు  అసలు ఆగదు. ఎందుకంటే వైఎస్  రెండవమారు గెలిచాక ఇంట్లో హాయిగా కూర్చోలేదు. ప్రజల కోసం వారి మంచి కోసం రచ్చ బండ పేరిట‌ బయల్దేరారు. ఆ సమయంలో ఆకాశం మేఘావ్రుత్తమైఉంది. జోరుగా వాన కురుస్తోంది. అంతా హాయిగా ఇంట్లో ఉంటే ప్రజా సేవకుడు కాబట్టి వైఎస్సార్ తన ప్రజల కోసం పర్యటన పెట్టుకున్నారు.

 

సరే ఆయన హెలికాప్టర్ మబ్బుల్లో చిక్కుకోవడం, ఆ మబ్బుల్లోనే ఆయన కన్ను మూయడం అన్నీ జరిగాయి. ఇవన్నీ ఇలా ఉంటే మరుసటి రోజు ఉదయాన్నే వైఎస్సార్ బయల్దేరి వెళ్లారు. ముందు రోజు వరకూ అసెంబ్లీ ఉంది. అయినా శ్రమ అనుకోకుండా ఆయన జనం కోసం తపించారు.

 

మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన కుటుంబ సభ్యులతో ఎలా గడిపారు. ఎలా  వారితో ఉన్నారు. చనిపోవడానికి ముందు రోజు వైఎస్ ఇంట్లో ఎలా గడచింది ఇవన్నీ ఆసక్తికరమైన ఘటనలే. వీటిని సమాధానంగా నాతో నాలో వైఎస్సార్ అన్న పుస్తకంలో విజయమ్మ 2009 సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి గురించి కొన్ని ఘటనలు  రాశారు. ఆ రాత్రి వైఎస్సార్ జగన్ తో చాలా విషయాలు మాట్లాడారుట. 

 

మనం ఎవరికైనా  మంచి చేయాలనుకుంటే సరిపోదు. దాన్ని పూర్తిగా  చేరవేయగలగాలి.  అలా వ్యవస్థలో కూడా మార్పు తేవాలి. ఏదీ నసులో అనుకుంటే అది వట్టి  వేస్ట్.  అదే ఆచరణలో పెడితేనే ఫలితం ఉంటుందని జగన్ తో వైఎస్సార్ అన్నారని విజయమ్మ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక అదే రోజు రాత్రి కుమార్తె షర్మిల తో ఆయన మాట్లాడారుట. రేపు మంచి ప్రోగ్రాం ప్రజల కోసం మొదలుపెడుతున్నాను అంటూ రచ్చ బండ గురించి చెప్పారుట.

 

 ఇలా కుటుంబంతో కూడా ఆయన జనాలకే తలచుకున్నారు. ఆ మాటలే చివరి మాటలు అవుతాయని వారు ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఆయన తిరిగి రాని లోకాలని వెళ్ళిపోయి జనం గుండెల్లో శాశ్వతంగా దేవుడిగా నిలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: