ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మారుమ్రోగుతోంది. పలు విషయాల్లో యూపీ సీఎం తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా వికాస్ దూబే ఎన్ కౌంటర్ వల్ల యోగి ఆదిత్యనాథ్ పేరు చర్చల్లో వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఏపీని పాలించిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుని విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచేవారు. 
 
రౌడీయిజం, ఫ్యాక్షనిజంలాంటి అరాచకాలు ఉమ్మడి ఏపీలో జరుగుతున్న సమయంలో అప్పటి సీఎంల సూచనల మేరకు పోలీసులు అలాంటి వాటికి పాల్పడుతున్న వాళ్లను ఎన్ కౌంటర్ చేయడం, బైండవర్ చేయడం, నగర బహిష్కరణ చేయడంలాంటివి చేశారు. సీఎంల ఆదేశాల ప్రకారం రౌడీలు, ఫ్యాక్షనిస్టుల విషయంలో కఠినంగా వ్యవహరించిన పోలీసులకు గుర్తింపు వచ్చింది. 
 
ఉమేష్ చంద్ర, వ్యాస్, డీటీ నాయక్, సురేంద్రనాథ్, ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ల కృషి వల్ల రౌడీయిజం, ఫ్యాక్షనిజం అదుపులోకి వచ్చింది. పోలీసులు అంటే రాజకీయనాయకులు సైతం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల తెలంగాణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో చంద్రబాబు, వైయస్సార్ కీలకంగా వ్యవహరించారు. 
 
ప్రస్తుతం ఏపీలో మహిళలపై అఘాయిత్యాల నిందితుల విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని కేసుల విషయంలో పురోగతి లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ మాత్రం అప్పటి చంద్రబాబు, వైయస్సార్ లను గుర్తు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెడుతూ ఇతర సీఎంలతో పోలిస్తే ప్రత్యేకత నిలుపుకుంటున్నారు. ఎన్ కౌంటర్ లపై మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రజల్లో మాత్రం ఆయా రాష్ట్రాల సీఎంలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.                   

మరింత సమాచారం తెలుసుకోండి: