తెలుగుదేశంలో పార్టీలో నారా లోకేష్(చినబాబు) పెత్తనం కొనసాగుతుందనే విషయం తెలిసిందే. పార్టీలో ఏ పదవుల పంపకమైన చినబాబు కనుసన్నల్లోనే నడుస్తాయి. గత కొన్నేళ్ళ నుంచి టీడీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే పెద్దగా పార్టీని నడిపించే సామర్ధ్యం లేకపోయినా సరే లోకేష్ పెత్తనం చెలాయించడం వల్లే, చాలామంది నేతలు టీడీపీని వదిలేసి వెళ్లిపోతున్నారు. పార్టీని వీడే ప్రతి నాయకుడు కూడా చినబాబుపై విమర్శలు చేసే వెళుతున్నారు.

 

ఈ విమర్శలు ఇలా నడుస్తుండగానే చినబాబు మరో మిస్టేక్ చేసినట్లు కనబడుతోంది. ఆయన చేసిన రాజకీయానికి ఓ యువనాయకుడు బలైపోయినట్లే తెలుస్తోంది. తాజాగా టీడీపీలో కీలకంగా ఉండే తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య (టి.ఎన్.ఎస్.ఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేశారు. యువనేత బ్రహ్మం చౌదరీని పక్కనబెట్టి, విశాఖకు చెందిన ఎం.వి. ప్రణవ్ గోపాల్‌కు టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు పదవి ఇచ్చారు. మూడు రాజధానుల నేపథ్యంలో విశాఖకు చెందిన ప్రణవ్‌కైతే కాస్త టీడీపీకి బలం వస్తుందని ఉద్దేశంతో చినబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 

అయితే బ్రహ్మంతో పోలిస్తే ప్రణవ్ ఏ మాత్రం సరైన నాయకుడు కాదని తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడుగా బ్రహ్మం బాగానే కష్టపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై బ్రహ్మం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. అలాగే టీవీ డిబేట్లలో సమర్ధవంతంగా మాట్లాడగల సత్తా బ్రహ్మాంకు ఉంది. ఇంగ్లీష్‌లో కూడా బ్రహ్మంకు మంచి పట్టుంది. ఇంకా యువనాయకుడుగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

 

ఇక ఈ విధంగా టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్ష పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించిన బ్రహ్మంని తప్పించి, ప్రణవ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని యువ తమ్ముళ్ళు భావిస్తున్నారు. అయితే ఇంతకుముందు బ్రహ్మం టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ పదవిని వదులుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ లోకేష్ సర్దిచెప్పడంతో బ్రహ్మం పదవిలో కొనసాగారు. కానీ చినబాబు సడన్‌గా బ్రహ్మంని తప్పించడంపై మాత్రం తమ్ముళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: