దేశంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాలు పరిమిత లాక్ డౌన్ వైపు మొగ్గుతున్నాయి. మెట్రో నగరాలు, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కొన్ని రోజు పాటు లాక్ డౌన్ విధిస్తున్నారు. యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు.. ఇలా అన్ని చోట్లా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. 

 

కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి యూపీలో లాక్ డౌన్  మొదలైంది. సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. కరోనా కేసులు పుణేలో.. ఈ నెల 13వ తేదీ నుంచి పది రోజులపాటు లాక్ డౌన్ విధించారు. పుణెతోపాటు సమీపంలో గల పింప్రీ, చించ్ వాడ్, ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు. థానే జిల్లాలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ పొడిగించారు. లాక్ డౌన్ సమయంలో కేవలం పాలు, మందులు మాత్రమే తెరుచుకుంటాయని అధికారులు స్పష్టంచేశారు. అత్యవసర సేవలకు  మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 10 రోజుల లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అధికారులు  తెలిపారు.

 

కేరళ రాజధాని త్రివేండ్రంలో కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమల్లో ఉంది. సీఎం విజయన్ ప్రకటించిన ప్రకారం త్రిపుల్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పాలు, నిత్యావసరాలు, మందులు మినహా ఏవీ అనుమతించడం లేదు. రోనా నివారణ  చర్యల్లో భాగంగా కంటైన్ మెంట్ జోన్లలో 7 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ. గురువారం సాయంత్రం 5  గంటల నుంచి 7 రోజుల పాటు కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. 

 

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఈ నెల 13, 14 తేదీల్లో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ టైమ్ లో కరోనా బాధితుల కాంటాక్ట్స్ ను ట్రేస్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గౌహతిలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా జులై 5 నుంచి ఆగస్ట్ 2 వరకు వరుసగా ఐదు ఆదివారాలు లాక్ డౌన్ ఉంటుందని కర్ణాటక సర్కారు ప్రకటించింది. అయితే శనివారాలు కూడా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: