పొట్టకూటి కోసం కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఉపాధి పొందుతూ వచ్చిన కొంత ఆదాయాన్ని ఇంటికి పంపిస్తు దేశం కాని దేశం లో జీవనం సాగిస్తున్న భారతీయులు ఎంతోమంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో  మంది కార్మికులు ఇతర దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు, అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఇలా ఇతర దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడం తో జీవనం దుర్భరంగా మారిపోయింది. 

 

 అయితే ఇలా ఉపాధి కోసం దేశం దాటి తమ  దగ్గరికి వచ్చిన వారిని సంక్షోభం సమయం లో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సింది  పోయి.. సంక్షోభ సమయాన్ని ఆసరాగా చేసుకుని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే ఒమన్ లో ఎంతో మంది తెలుగు వాళ్ళు తిరగబడుతున్నారు అన్నది ప్రస్తుతం ఒక టాక్ వినిపిస్తుంది. ఒమన్ లోని పలు ప్రాంతా ల్లో తెలుగు కార్మికులు  ఎక్కువ మొత్తంలో తిరగబడుతున్నారు, కాగితాలు చించడం ఆఫీసులు  ధ్వంసం చేయడం ఫర్నిచర్ ధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు, 

 

 దీనికి కారణం కరోనా  సంక్షోభం నేపథ్యం లో 30 శాతం మందిని  ఉద్యోగాల నుంచి తొలగించారు.. కనీసం ఎలాంటి ఫెసిలిటీ లేని ఆవాసం కల్పించడం దారుణమైనటువంటి భోజనం పెట్టడం లాంటివి చేశారు. అంతేకాకుండా  కొంతమంది వ్యాపారులు కరోనా ను  అడ్డంపెట్టుకుని డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఉద్యోగాల నుంచి తీసిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఏకంగా 25 నుంచి 30 శాతం జీతాలు తగ్గిస్తూ తీసుకుంటామని చెబుతున్నారు, ఈ నేపథ్యంలో వ్యాపారుల తీరు తో విసుగెత్తిపోయిన  తెలుగు వాళ్ళందరూ తిరగబడ్డారు ఉన్నటువంటి ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: