ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లో ఎంతో  భయపడినప్పటికీ ఆ తర్వాత మాత్రం కరోనా వైరస్కు వ్యాక్సిన్ రాకపోవటంతో.. కొన్ని రోజుల పాటు ఈ మహమ్మారి వైరస్ తో సహజీవనం తప్పదు అని దాదాపుగా అందరూ అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ పై  ఆశలు పెట్టుకోకుండా తమంత తాము రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం... తగిన జాగ్రత్తలు పాటించడం లాంటివి చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ ను  నియంత్రించేందుకు ఎంతగానో తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. 

 


 అయితే కేరళ ప్రభుత్వం కరోనా  వైరస్ నియంత్రణలో ఎంత కఠినంగా వరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అతి తక్కువ కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. ప్రభుత్వం  ఎంత తీవ్రంగ శ్రమిస్తున్నప్పటికీ  ప్రభుత్వ లక్ష్యానికి తూటాలు  పొడిచే విధంగా కొంత మంది ప్రజలు వ్యవహరిస్తున్నారు, తాజాగా కేరళ లో జరిగిన ఘటన సభ్య సమాజం తీరు ఎటు పోతుందో  అనే ప్రశ్నకు నిలువుటద్దంగా మారిపోయింది. కేరళలో సూపర్ స్ప్రేడర్ గ్రామంగా ఒక గ్రామాన్ని ఆరోగ్య కార్యకర్తలు గుర్తించారు

 

 పుత్తూరు అనే గ్రామంను  సూపర్ స్ప్రేడర్ గ్రామంగా గుర్తించింది  కేరళ ప్రభుత్వం. అక్కడ ప్రజలు ఏమాత్రం పట్టింపు లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం మాస్కులు ధరించకుండా ఉంటున్న  నేపథ్యంలో... ప్రభుత్వం కొంత మంది వైద్యుల బృందాన్ని ఆ గ్రామ  అవగాహన కల్పించేందుకు టెస్టులు చేసేందుకు అక్కడికి పంపిస్తే ఆ గ్రామ ప్రజలు దారుణంగా వ్యవహరించిందని ఏకంగా ఎనిమిది మంది వైద్య బృందం పై దాడి చేశారు.  కార్ లోకి చొరబడి మాకు కరోనా ఉంటే  మీకు కూడా రావాలి అంటూ చెబుతూ దారుణంగా ప్రవర్తించటంతో  వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆ ఒక్క గ్రామంలోని 1500 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారు ఉన్నటువంటిది  ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అలాంటి ప్రజలకు బుద్ధి చెప్పి కరోనా  జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక బలగాలను పంపించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: