చైనా భారత్ మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో చర్చల తరువాత చివరికి చైనా వెనక్కి తగ్గి రెండు ప్రాంతాలలో వెనుదిరిగింది. కానీ పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం కేవలం ఒక్క అడుగు వెనక్కి వేసింది తప్ప.. పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. అక్కడే  కసరస్సు దగ్గర తిష్ట వేసుకొని కూర్చున్న చైనా మరోసారి కొత్త వివాదానికి తెరలేపింది. పాంగ్వాన్  సరస్సు దగ్గర ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు వెనక్కి వెళ్లాల్సి ఉండగా కేవలం ఒక్క అడుగు వెనక్కి వేసి ఫింగర్ 5 వరకు మాత్రమే వెనక్కి వెళ్ళింది చైనా. 

 


 ఓవైపు ఇలా చైనా భారత్ తో వివాదానికి తెర లేపుతూనే  మరోవైపు హితబోధ చేస్తూ డొల్ల  మాటలు మాట్లాడుతుంది. ఇక తాజాగా చైనా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరం గా మారిపోయాయి. భారతదేశం మాకు శత్రుదేశం కాదని.. శాశ్వత మిత్రదేశం అంటూ చైనా వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ అంశాలలో భారత చైనా తో కలిసి పని చేయాలి అంటూ చైనా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. అంతే కాకుండా చైనా రాయబారి మరి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.. భారత చైనా దేశాలు ఎప్పుడు శాంతి మంత్రం తో.. శత్రువుల్లా  కాకుండా భాగస్వాములుగా ఉండి.. సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. 

 


అయితే భారత్ ఎప్పుడూ చైనాతో స్నేహపూర్వకంగా నే ఉంది కానీ కావాలని భారత్ తో వివాదానికి తెరలేపింది చైనా. అలాంటి చైనా ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం.. భారతదేశానికి రోజురోజుకు ఇతర దేశాల మద్దతు పెరిగిపోవడమే అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోవద్దు అంటూ భారత్పై చైనా ఒత్తిడి  తీసుకొచ్చింది.. కానీ ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా ఇలాంటి హిత బోధలు చేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: