గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల హక్కు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నీటి ప్రాజెక్టుల జల హక్కుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం లో ప్రతిపక్షాలు కూడా కలగజేసుకుని విమర్శలు గుప్పించిన  నేపథ్యంలో మా మధ్య వివాదం ఏం వివాదం లేదు ఏదైనా ఉంటే న్యాయపరంగా చూసుకుంటామని  ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తెలిపారు. మా  మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూసి ఓర్వలేక  ప్రతిపక్షాలు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటూ కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించాడు. జల హక్కుల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులం  చర్చించుకుంటూన్నామని ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటూ తెలిపారు. కెసిఆర్. 

 

 కానీ ఆయన చెప్పినవన్నీ ప్రస్తుతం నీటి మీద రాసిన మాటలే అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డు కీ ఓ లేఖ రాసింది. గోదావరి పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రోజుకి మూడు టీఎంసీల నీటిని మళ్లించే  పథకం విషయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు ని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుదారి పట్టించింది అని తెలంగాణ ప్రభుత్వం లేఖలో  ఆరోపించినట్లు తెలుస్తోంది. గతంలో పలు ప్రాజెక్టుల  విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినదానికి ప్రస్తుతం జరుగుతున్నదానికి  అసలు పొంతనే లేదని.. ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుని  తప్పుదారి పట్టించింది అంటూ ఓ కీలక లేఖ రాసింది తెలంగాణా ప్రభుత్వం. 

 

 అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ పైపైకి అలయ్ బలయ్  తీసుకుంటున్నప్పటికీ లోలోపల మాత్రం ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లు  చూసుకుంటూ వ్యవహారాలు సాగిస్తున్నారు  అన్నది ప్రస్తుతం కేసీఆర్ సర్కార్  లేఖతో అర్థం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే జల హక్కు విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపితే ఈ వివాదం కాస్త సద్దుమణుగుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: