ప్రస్తుతం భారత్ చైనా మధ్య తలెత్తిన వివాదం లో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు అవుతున్న విషయం తెలిసిందే. మామూలుగానే చాలా దేశాలతో  చాలా మటుకు చైనా వివాదాలు   పెట్టుకుంది. ఇప్పుడు ఇండియాతో  అతి పెద్ద వివాదాన్ని రగిల్చింది. ఫిజికల్ దాడికి దిగడం ఇరుదేశాల సైనికులు చనిపోవడం వరకు వెళ్ళింది చైనా భారత్ వివాదం. ఇక రోజు రోజుకు భారత్ కి ప్రపంచ దేశాల మద్దతు పెరిగిపోతున్న నేపథ్యంలో  చైనా కాస్త వెనక్కి తగ్గి రెండు ప్రాంతాల్లో  వెనక్కి వెళ్లినప్పటికీ పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం ఇంకా తిష్ట వేసుకుని కూర్చుంది. పైపైకి డొల్ల  మాటలు చెబుతూ.. లోలోపల మాత్రం యుద్ధవాతావరణం రగిలించే విధంగా వ్యవహరిస్తుంది చైనా. అయితే ప్రస్తుతం భారత్ చైనా దేశాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ వైపే  ఉంటున్న విషయం తెలిసిందే. 

 

మామూలుగానే  అమెరికా  భారత్ అమెరికా మధ్య అన్ని రకాల సంబంధాలు ఎంతో ధృడంగా మారిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  చైనా భారత్  వివాదంలో అమెరికా భారత్ కి మద్దతు తెలిపింది. అంతే కాకుండా అటు జపాన్  కూడా భారత్ వైపే నిలిచింది. ఇలా జపాన్ అమెరికా-భారత్ మధ్య సైనిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ మూడు దేశాల సైన్యాలు కలిసి.. మలబార్ నావల్ ఎక్ససైజ్ నిర్వహిస్తున్న  విషయం తెలిసిందే. 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో  దేశం కూడా ఈ గ్రూప్ లో చేరేందుకు ముందుకు వచ్చింది. తాజాగా మరో దేశం కూడా మలబార్ నావల్ ఎక్ససైజ్ లోకి వచ్చేందుకు మొగ్గు చూపింది. ఇటీవలే ఆస్ట్రేలియా దేశం అధికారికంగా మలబార్ నావల్ ఎక్సర్సైజ్ లో చేరుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏదైతే చైనా జరగకూడదు అనుకుంటుందో  ప్రస్తుతం అదే జరుగుతోంది. గతంలో 2004 సమయంలో భారత్పై చైనా ఆధిపత్యం చెలాయించిన సమయంలో భారత్  అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో సంబంధాలు పెట్టుకోకుండా అడ్డుకుంది చైనా. కానీ ప్రస్తుతం ఆయా దేశాల తోనే భారత్  సత్సంబంధాలను కొనసాగిస్తోంది చైనా పై దండెత్తేందుకు  సిద్ధమవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: