మోడీ.. ఒకనాడు గుజరాత్ కే చెందిన ముఖ్యమంత్రి.  అప్పట్లో అయన అసలు ఢిల్లీకే పెద్దగా వచ్చేవారు కాదు. అలా పన్నెండేళ్ల పాటు సీఎంగా పనిచేసి గుజరాత్ ని బీజేపీకి కంచుకోట చేశారు. ఆ తరువాత అనూహ్యంగా ప్రధాని రేసులోకి వచ్చి దేశానికి ప్రధాని అయ్యారు. ఒకసారి కాదు, రెండు సార్లు, అదీ ఫుల్ మెజారిటీతో మోడీ నెగ్గి జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఎదిగారు.

 

ఇక మోడీ ఈ విధంగా దేశీయంగా బలపడుతూనే అంతర్జాతీయంగానూ తన  సత్తా చాటుతున్నారు. ఇంతకు ముందు దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారంతా కూడా మోడీ కంటే కూడా విదేశీ వ్యవహారాల్లో తలపండిన వారే కానీ వారెవరూ కూడా మోడీలా పూర్తిగా అంతర్జాతీయ తెర మీద రాణించాలని ఉబలాటపడలేదు. 

 

కానీ మోడీ మాత్రమే  ప్రధానిగా తొలిసారి ప్రమాణం చేసిన దగ్గర నుంచే అదే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇపుడు మోడీకి ఇంటర్నేషనల్ గా మంచి పేరుంది. దానికి తగినట్లుగా అవకాశాలు కూడా కలసివస్తున్నాయి. ఇక మోడీ ప్రపంచానికి కరోనా రాకముందే బలమైన నేతగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకున్నారు. ఇపుడు ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. 

 

దాంతో అగ్ర రాజ్యాలే చెల్లాచెదురు అవుతుననయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడా ఇలా అనేక దేశాలు ఇపుడు అంతర్జాతీయ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో మోడీ మరోమారు ఇపుడు అంతర్జాతీయ తెర వైపు ద్రుష్టి పెట్టారు. భారత్ ఎపుడూ ఒకరికి మద్దతు దేశంగా ఉండడం కంటే ఈ పరిస్థితులను అనువుగా మార్చుకుని తానే ఎందుకు లీడ్ చేయకూడదన్న ఆలోచనలు కూడా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల నుంచి వస్తున్నాయి. 

 

అచ్చం ఇలాగే మోడీ కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అమెరికా కరోనా సంక్షోభంతో మరో పదేళ్లకు కానీ కుదురుకునేలా లేదు, యూరోపియన్ దేశాలదీ అదే పరిస్థితి. చైనా కూడా వైరస్ కారణంగా ఇబ్బందులో ఉంది. పైగా కరోనా తన దేశం నుంచి వచ్చిందని అపవాదు కూడా ఉంది. దాంతో చైనా ముందడుగు వేయలేదు. ఈ విషమ పరిస్థితుల్లో ఆసియన్ దేశాల మద్దతు కూడగట్టి సరికొత్త అంతర్జాతీయ‌ వేదిక నిర్మాణానికి మోడీ ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.

 

ఆ దిశగా మోడీ ఈ మధ్య నినాదం కూడా ఇచ్చారు. ఇపుడున్న ఐక్య రాజ్యసమితి. ఇతర వేదికలు కూడా అతి తక్కువ జనాభా ఉన్న దేశాల గుప్పిట్లో ఉన్నాయి. ఆ స్థితిని మార్చేసి మోడీ కొత్తగా ఎక్కువ దేశాల భాగస్వామ్యంతో కొత్త ప్రపంచ వేదికకు పూనుకుంటారని అంటున్నారు. అదే జరిగితే చైనాకు గట్టి దెబ్బే. మనకు ఐక్య రాజ్య సమితిలో చోటు రాకుండా మోకాలడ్డుతున్న చైనాను తోసేసి కొత్త వ్యవస్థ రూపకల్పన చేస్తే చైనా కూడా కిక్కురుమనదు అంటున్నారు. ఇదే చైనా లాంటి దేశాలకు మోడీ ఇచ్చే సరికొత్త షాక్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: