వైయస్సార్ అనే పార్టీ పేరుతో షోకాజ్ నోటీసులు ఇవ్వటంతో ఏపీ అధికార పార్టీని అనేక ఇబ్బందులు మొన్నటి వరకు పెట్టారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వైయస్సార్ పేరుతో తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంతో రఘురామకృష్ణంరాజు దీనిని ఆధారం చేసుకుని అన్న వైయస్సార్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు భాషాతో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అన్న వైయస్సార్ పార్టీ వ్యవస్థాపకుడు భాషా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. తన పార్టీ పేరుతో ఏపీ అధికార పార్టీ చలామణి అవుతుందని నేరుగా ఎన్నికల కమిషన్ ను కలిసి పిటిషన్ సమర్పించిన ఆయన తాజాగా ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తన పార్టీ పేరును ఉపయోగిస్తూ రాజకీయాలు చేస్తున్నట్లు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

 

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరు ఉపయోగించుకొని తన పార్టీ పరువు తీస్తున్నట్లు పిటిషన్ లో భాషా పేర్కొన్నారు. చాలా వరకూ ప్రభుత్వ కార్యకలాపాలు తన పార్టీ పేరుతో చేస్తున్నారని చెలామణి అవుతున్నారని భాషా ఆరోపించారు. దీంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని 'అన్నా వైయస్సార్ పార్టీ' నేతలు మరియు అధ్యక్షుడు భాషా ఢిల్లీ హైకోర్టును కోరారు.

 

అయితే ఈ విషయంలో వైసీపీ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోపక్క మేధావులు ఇది చాలా  సీరియస్ విషయం అని ఏ మాత్రం లైట్ తీసుకున్న జగన్ పార్టీకి భారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సరైన స్ట్రాంగ్ పాయింట్ తో ఢిల్లీ హైకోర్టులో 'అన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు భాషా కి వివరణ ఇవ్వకపోతే ఏపీలో మళ్లీ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: