జాతీయ పార్టీగా, కేంద్ర అధికార పార్టీగా బీజేపీకి ఎదురే లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి ప్రత్యర్థుల భయం పెద్దగా లేదు. కాంగ్రెస్ బలహీనపడంతో పాటు, ప్రాంతీయ పార్టీల కూటమి కూడా దెబ్బతినడంతో, బీజేపీకి ఎదురే లేదు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. కానీ ఏపీ విషయానికి వస్తే, ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నా, బలమైన నాయకులు ఉన్నా, క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలు లేకపోవడంతో, ఆ పార్టీ ఏపీలో ఎదగలేకపోతోంది అనేది ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. ఎప్పటి నుంచో ఏపీలో బలపడదామని, క్షేత్రస్థాయిలో బలం తెలుసుకుందామని, బీజేపీ చూస్తున్నా, ఆ పార్టీకి ఆదరణ దక్కడం లేదు.

 

IHG's three ...

ప్రాంతీయ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉండడంతో, బీజేపీకి లేకపోవడం పెద్దగా ఆదరణ లేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. ఇక కేంద్ర అధికార పార్టీగా ఉండడంతో, ఇదే సమయంలో ఏపీలో ఎదగాలని చూస్తోంది. ఈ మేరకు ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలు, నిరసనలు చేస్తూ, కొద్ది రోజులుగా బిజెపి హడావుడి చేస్తోంది. అయినా, ఈ కార్యక్రమాలకు పార్టీ కీలక నాయకులు అంతా వస్తున్నారు తప్ప, కార్యకర్తలు ఎవరూ పెద్దగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల క్రితం అమరావతి ఉద్యమంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ తరువాత రావెల కిషోర్ బాబు, టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారు వెళ్లడమే తప్ప, వారి వెనుక కార్యకర్తలు ఎవరు పెద్దగా కనిపించలేదు.

 

కరోనా వ్యవహారం ఉంది కాబట్టి వీరంతా రాలేదేమో అనుకున్నా, అంతకుముందు బిజెపి చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు కూడా కార్యకర్తలు ఎవరూ హాజరు కాలేదు. ఇప్పుడు ఇదే భయం బిజెపి నాయకులు ఎక్కువైంది. తాము ఎన్ని పోరాటాలు చేసి, బలం పెంచుకుని క్షేత్రస్థాయిలో, పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయోజనం లేకుండా పోయింది. కార్యకర్తలు లేకపోతే ఎంత చేసినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంలో నాయకులు ఉన్నారు. ఎప్పుడూ నాయకుల హడావిడి తప్ప కార్యకర్తల సందడి పెద్దగా లేకపోవడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. తాము ఏపీలో బాగా బలపడతామనే అభిప్రాయం కూడా బిజెపి నాయకులు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: