ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. అధినేత నిర్ణయం ఏంటో  తెలియక ఆందోళన పడిపోతున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అంటూ జగన్ సంకేతాలు ఇవ్వడంతో పాటు, ఈ నెల 22వ తేదీ మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు లీకులు ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికివారు ఈదఫా తమకు అవకాశం దక్కుతుందనే అంచనాలో ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవడంతో, త్వరలోనే మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆ రెండు స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని సీనియర్ నాయకులు ఆశ పడుతుండగా, లేదు లేదు తమకు అవకాశం దక్కుతుంది అని జూనియర్ లు సైతం పోటీకి వస్తున్నారు.

IHG

మొదట్లో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తూర్పు గోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ పేర్లు గట్టిగా వినిపించాయి. ఆ తరువాత కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. కొద్ది రోజులుగా రాజకీయ వ్యాఖ్యలతో యాక్టివ్ గా ఉంటూ, వార్తల్లో ఉంటున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మంత్రివర్గం రేసులో ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అలాగే మాడుగుల ముత్యాలనాయుడు కూడా పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం కు కనుక మంత్రి పదవి ఇస్తే, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతికి స్పీకర్ గా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ఆ వర్గంలో ఆదరణ పెంచుకోవచ్చనే విధంగా జగన్ చూస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది.

 

ఇక వీరే కాకుండా, పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా, అసలు జగన్ మనసులో ఏముంది అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అసలు జగన్ కరుణా కటాక్షాలు ఎవరిమీద ఉంటుందో తెలియక ఎమ్మెల్యేలంతా ఉత్కంఠగా జగన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: