నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ వెయ్యాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తూ మరియు పార్టీ నాయకులు అవినీతిపరులంటూ ఏకంగా ఇటీవల రఘురామకృష్ణంరాజు మీడియా ముందు ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో వైసిపి అధిష్టానం రఘురామకృష్ణంరాజు కి షోకాజ్ నోటీసులు పంపించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ పార్టీ పెద్దలు మరియు రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఇది ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇలాంటి తరుణంలో వైయస్ జగన్.. సొంత జిల్లాలో రఘురామకృష్ణంరాజు కి చెక్ పెట్టాలని ఎవరి మీద అయితే రఘురామకృష్ణం రాజు  గెలిచాడో ఆ క్యాండెట్ కనుమూరి ని పార్టీలోకి తీసుకోవటంతో పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

దీంతో రఘురామకృష్ణంరాజు ఒకపక్క పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తూ మరోపక్క బిజెపి అధిష్టానానికి దగ్గరవుతూ వస్తున్నారు. అంతేకాకుండా వైయస్ జగన్ ని వ్యతిరేకించే మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ  ఎన్నికలలో గెలవడం అంటే నా కష్టం వల్ల నేను గెలిచాను. ఎవరి బొమ్మ చూసి ప్రజలు నాకు ఓట్లు వేయలేదు అంటూ ఇష్టానుసారంగా రఘురామకృష్ణంరాజు ఆయా మీడియా ఛానల్స్ లో కామెంట్లు చేయడం జరిగింది.

 

ఇలాంటి తరుణంలో రఘురామ కృష్ణం రాజు పై అదే జిల్లాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తమపై గతంలో చేసిన వ్యాఖ్యలకు పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. విజయ ఉండగా తాజాగా ఏకంగా రఘురామకృష్ణంరాజు ని పార్టీ నుండి సస్పెండ్ చేసి నరసాపురం ఉప ఎన్నికలకు వెళ్లాలని రాజుగారు ఎపిసోడ్ ఉప ఎన్నికలలో గెలిచి ముగించాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: