చంద్రబాబు హయాంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారని అనేక లెక్కలు ఇటీవల వైసీపీ నేతలు బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ తిండి ఖర్చు మరియు కొంతమంది ప్రభుత్వ అధికారులు ట్రావెలింగ్ ఖర్చు ఇంకా అదే విధంగా సచివాలయం మరమ్మత్తుల కోసం అదే రీతిలో భోజనాలకు పెట్టిన ఖర్చు లు అన్నీ కలిపి కొన్ని వేల కోట్ల లో టీడీపీ ప్రజా ధనం దుబారా చేసిందని ఇటీవల కొన్ని లెక్కలు బయటపెట్టారు. ఇదే రీతిలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అసలు అనవసర ఖర్చులకు వెళ్లడం లేదని వైసీపీ నేతలు ప్రతి విషయంలో వైయస్ జగన్ జవాబుదారీగా ఖర్చు పెడుతున్నారని ఆదర్శప్రాయంగా పరిపాలన చేస్తున్నారని వైసీపీ కాస్త గట్టిగానే చెప్పుకుంటుంది. ఇటువంటి తరుణంలో జగన్ కి ఊహించని టెండర్ పెట్టారు నారా లోకేష్.

 

అదేమిటంటే అప్పట్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టైములో మొత్తం అయిన ఖర్చు 29 లక్షలు మాత్రమే అంటూ వైసీపీ చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అది కేవలం ప్రచారమని  జగన్ ప్రమాణ స్వీకారానికి  కోట్ల రూపాయలు అయింది అంటూ కొన్ని రకాల ఆధారాలతో సహా టీడీపీ వైసీపీ ప్రభుత్వం పై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా లో వైసీపీ ప్రభుత్వం పై ఆధారాలతో సహా విమర్శలు చేశారు.

 

వాటర్ బాటిల్ మరియు మజ్జిగ ప్యాకెట్లు ఖరీదు అక్షరాల 43.44 లక్షలు ఖర్చు చేసినట్లు అదేవిధంగా ఇంకా కొన్ని వాటికి భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు వాటికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం జారీ చేసిన జీవోను సోషల్ మీడియాలో జతచేసి నారా లోకేష్ జగన్ పరువు తీసేసాడు. మొత్తంమీద 29 లక్షల తో ప్రమాణ స్వీకారం సింపుల్ గా చేశామని చెప్పుకునే వైసీపీ నేతలకు నారా లోకేష్ సోషల్ మీడియాలో అన్ని ఆధారాలతో కొన్ని కోట్లు ఖర్చు అయ్యిందని వైసీపీ పరువు తీసేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: