2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పై మనసు పారేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్లే భయంకరంగా తెలుగుదేశం పార్టీ స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని తాజాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం లెక్కలు వేసి మరి తెలుసుకున్నారట. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఓట్లు బాగా చీల్చిందని… వాస్తవంగా అయితే ఆ ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడాల్సిన ఓట్లు అని ఇటీవల అధ్యయనం చేసి తెలుసుకున్నారట.

IHG

రెండు గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద గెలిచిన మెజారిటీ కంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు చీల్చడం జరిగింది అనే అభిప్రాయంతో టీడీపీ ఉంది. గత సార్వత్రిక ఎన్నికలలో  చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ విడిపోయి ఉండకుండా ఉంటే కలసి పోటీ చేస్తే కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 50 -70 సీట్లు పైగా వచ్చేవని, అప్పుడు వైసీపీకి ఇంత మెజార్టీ వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.

IHG

విడివిడిగా పోటీ చేయడం వల్లే జగన్ భారీ మెజార్టీతో గెలిచారు అని టిడిపి డిసైడ్ అయ్యింది. దీంతో జనసేన ని ఎట్టిపరిస్థితుల్లో 2024 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయించు కూడదని పవన్ కళ్యాణ్ ని వదులుకోకూడదని చంద్రబాబుపై పార్టీలో  నాయకులు ఒత్తిడి చేస్తున్నారట. దీంతో రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ క్యాడర్ పై టిడిపి నాయకులు గ్రిప్ పెంచుకోవాలని అనుకుంటున్నట్లు వారితో ఎలాంటి తగాదాలు కాకుండా స్మూత్ గా డీల్ చేసే విధంగా  కార్యక్రమాలు నిర్వహించాలి అని టీడీపీ అధిష్టానం డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: