ఇటీవల ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకి కాంగ్రెస్ హయాంలో 2010లో కేటాయించిన భూములను రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అమరరాజా సంస్థకి చెందిన 483.27 ఎకరాలలో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు జగన్ సర్కార్ అమరరాజా సంస్థ నుండి భూములు తీసుకోవాలి అని ఏపీఐఐసీ శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పదేళ్లు దాటిన ఉద్యోగాల కల్పన సరిగ్గా ఇవ్వ లేకపోవడంతో అమరరాజా సంస్థ నుండి భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు జీవోలో పేర్కొంది. 2010లో చిత్తూరు జిల్లా కొత్త పల్లి లో అమరరాజా సంస్థకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించడం జరిగింది. డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు అప్పటి సర్కారు భూమి కేటాయింపు చేయడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ఈ సంస్థ పెట్టి పది సంవత్సరాలు అయినా సరైన ఉద్యోగాలు ఇవ్వక పోవటంతో పాటు సంస్థలో ఎదుగుదల లేకపోవడం తో జగన్ సర్కార్ కొన్ని వందల ఎకరాల భూములను మళ్లీ వెనక్కి తీసుకోవటం జరిగింది. ఇటువంటి తరుణంలో అమరరాజా సంస్థ యాజమాన్యం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో సవాలు చేయడానికి రెడీ అయ్యింది. తాము సేల్ డీడ్ అగ్రిమెంట్ ద్వారా ఏపీఐఐసీ దగ్గర భూములు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని.. ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని… ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.

 

ఆ భూమిని అప్పట్లో ఏపీఐఐసీకి ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీఐఐసీ తమకు విక్రయించింది అని ఒప్పందం ప్రకారం తాము కల్పిస్తామని చెప్పిన ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు హైకోర్టు దృష్టికి అమరరాజా సంస్థ తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా చెప్పిన ఉద్యోగాల కంటే ఎక్కువ స్థాయిలో అమరరాజా సంస్థ కల్పించలేదని ప్రభుత్వం చెప్పుకొస్తోంది మరి ఈ విషయంలో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు హైకోర్టు దగ్గర చూపిస్తే అమరరాజా సంస్థకి గట్టి షాక్ తగులుతుంది, లేదంటే యధావిధిగా హైకోర్టు నుండి జగన్ సర్కార్ కి మరో మొట్టికాయ పడటం గ్యారెంటీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: