వైసీపీ పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ 'నాలో నాతో వైయస్సార్' అనే పుస్తకాన్ని ఇటీవల ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని చాలావరకు బయట ప్రపంచం నాయకుడిగా మాత్రమే చూడటం జరిగింది. కానీ వైఎస్ విజయమ్మ... వైయస్ రాజశేఖర్ రెడ్డి తో 37 సంవత్సరాలు కలిసి జీవించడం తో ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక నాయకుడిగా మరియు చాలా దగ్గరగా వైఎస్ విజయమ్మ చూడటంతో ఆయనలో చాలా విషయాల గురించి ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

 

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో పుస్తకాన్ని డైరెక్టుగా మార్కెట్లోకి విడుదల చేయకుండా ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో విడుదల చేయడం జరిగింది. అమెజాన్ ఇండియా సంస్థ ద్వారా అమ్మకానికి పెట్టారు. కాగా విడుదలైన మొదటి  ఎడిషన్ 5 వేల కాపీలు  ఒకే ఒక్క రోజులో అమ్ముడుపోయాయి. ఇది ఎవరు ఊహించని రికార్డు అని, ఒక పొలిటికల్ నాయకుడికి సంబంధించిన పుస్తకం ఈ స్థాయిలో అమ్ముడుపోవడం సెన్సేషన్ అని చెప్పుకొస్తున్నారు. అది ఇటువంటి రోజుల్లో. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ప్రజలలో ఆయన మీద ఇంకా అభిమానం ఉందని ఈ పుస్తకం అమ్ముడుపోయిన విధానం బట్టి అర్థమవుతుందని తాజాగా కొంతమంది వైసీపీ మద్దతు దారులు అంటున్నారు. ఈ రికార్డ్ జగన్- విజయమ్మ ఇద్దరు కూడా ఊహించి ఉండరు అని చెప్పుకొస్తున్నారు.

 

అసలు పుస్తకాలు చదివే అలవాటు లేని ఈ తరంలో ఈ స్థాయిలో తెలుగు పుస్తకం ఆదరణ పొందటం చాలా గ్రేట్ అని పలువురు ప్రచురణకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండో ఎడిషన్ మరో రెండు రోజుల్లో వ‌స్తుంద‌ని ఎమెస్కో ప‌బ్లికేష‌న్స్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. పుస్తకానికి మంచి ఆదరణ వస్తున్న తరుణంలో ఇంగ్లీష్ పాఠకులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని పెంగ్విన్ పబ్లికేషన్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: