కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను నాశనం చేస్తుంది. ఇప్పటికే ఏకంగా కోటి 28 లక్షలమందికిపైగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇంకా ఇందులో 74 లక్షలమంది కరోనా వైరస్ నుండి కోలుకోగా 5 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు. 

 

ఇంకా అలాంటి కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇంకా ఇది ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా ఈ నేపథ్యంలోనే రోగ నిరోధక శక్తి పెంచే తులసి టీ తో కరోనా వైరస్ కు ఇలా చెక్ పెట్టండి. సాధారణంగానే మనదేశంలో తులసికి దేవతా స్థానం ఇచ్చం. 

 

ఇంకా అలానే ఈ తులసిలో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఆరోగ్యనికి ఉపయోగిస్తారు. తులసి ఆకులు వేసి కాచిన టీ తాగితే రోగనిరోధక శక్తి పెరగటమే కాదు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే? జలుబును, జ్వరాన్ని తగ్గించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఈ టీ అందిస్తుంది. మరి అలాంటి తులసి టీని ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

తులసి ఆకులు - గుప్పెడు,

 

అల్లం - అంగుళం ముక్క (దంచుకోవాలి),

 

వాము, జీలకర్ర-  చిటికెడు,

 

మిరియాలు -  4 గింజలు

 

బెల్లం తరుగు - చెంచా

 

తయారీ విధానం.. 

 

గిన్నెలో గ్లాసున్నర నీళ్లు పోసి అందులో పై పదార్థాలన్నీ వేసి సగానికి మరిగించి వడపోస్తే బోలెడన్ని ఔషధ గుణాలున్న వేడివేడి తులసి టీ తయారవుతుంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ తులసి టీని వారానికి ఒకసారి అయినా తాగండి జాగ్రత్తలు తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: