ప్రేమ పిచ్చిది అంటారు.. ఆ పదం అక్షరాల ఈ యువతికి సరిపోతుంది.. ఎందుకంటే వృద్ధుడైన ఓ వ్యక్తిని ప్రేమికునిగా ఎంచుకుని అతనితో ఈ 19 సంవత్సరాల యువతి జంప్ అయ్యిందట.. అసలు ఈ పని మతి ఉండి చేసిందో, లేక మతి తప్పి చేసిందో తెలియదు గానీ ఈ యువతి చేసిన పనికి తల్లిదండ్రులు మాత్రం తలెత్తుకోవడం లేదట.. ఇక మనవరాలి వయసు ఉన్న ఆ అమ్మాయితో ప్రేమాయణం సాగించడానికి సాహసించాడంటే ఆ ముసలాడిలో కామకోరికలు ఏ స్దాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి.. అంతే కాదు అతడు మంచి వాడైతే ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లే వాడు.. అందువల్ల ఇక్కడ అర్ధం అయ్యేది ఏంటంటే.. వయస్సు చేసిన పొరబాటు వల్ల ఆ యువతి తప్పటడుగు వేసి జీవితాన్ని నాశనం చేసుకుంది..

 

 

ఇకపోతే ఈ ఘటన గుజరాత్‌లోని  పఠాన్ జిల్లాలో జరిగిందట.. ఆ వివరాలు చూస్తే.. గుజరాత్‌లోని పఠాన్ జిల్లా సిధాపూర్ పరిధిలో నివసిస్తున్న ఓ కుటుంబం పోలీస్ స్టేషన్‌లో తమ కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారట.. అంతే కాకుండా వారి ఇంటిపక్కన ఉండే వృద్ధుడు కూడా మాయమయ్యాడని.. తమ కూతురిని అతడే ఎక్కడికో తీసుకెళ్లాడంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.. అయితే ఈ కేసును తేలిగ్గా తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని వారిని పంపించి వేశారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుసుకున్న ఆ యువతి సోదరుడు గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన సోదరిని ఆ వృద్దుడే కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధిస్తున్నాడని పిటిషన్‌లో వెల్లడించాడు.

 

 

ఇక ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడింది. వెంటనే ఓ గడువు విధించి బాధితురాలిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పోలీసులు ఆ యువతి ఆచూకిని మాత్రం ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారట.. అదీ గాక కోర్టు వారు ఇచ్చిన గడువు ముగియడంతో, దర్యాప్తులో విఫలం అయిన పోలీసులకు అక్షింతలు వేస్తూ ఆ గడువును పొడిగిస్తూ, ఈ నెల 13వ తేదీ లోపు యువతిని ప్రవేశపెట్టాలని తేల్చి చెప్పింది.. ఇక ఆ యువతి కుటుంబ సభ్యులకు చిక్కేలోపల ఎన్నిరకాలుగా శారీరక బాధలు అనుభవిస్తుందో ఊహిస్తేనే భయంగా ఉంది.. అందుకే అంటారు మనసును అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే ఇలాగే జీవితాలు సర్వనాశనం అవుతాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: