మామూలుగా అయితే ఒక ఆడ మగ శృంగారంలో పాల్గొంటారు.. ఇది ప్రకృతి ధర్మం... కానీ ఆత్మలతో మహిళలు శృంగారంలో పాల్గొంటారా అంటే.. పాల్గొంటారు కానీ అది కేవలం సినిమాలలోనే.. మామూలుగా చాలా హారర్ సినిమాల్లో  ఇలా ఆత్మలు మహిళలపై లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూ  ఉంటాయి. నిజజీవితంలో ఇలాంటిది కుదురుతుందా.. ఆత్మలతో శృంగారం విషయం పక్కన పెడితే ఆత్మలు కనిపిస్తేనే భయంతో పరుగులు పెడతాం... ఇక ఆత్మలతో శృంగారమా అదెలా కుదురుతుంది అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా తాను 15 ఆత్మలతో శృంగారంలో పాల్గొన్న అని చెబుతోంది. అంతేకాదు ఆత్మలతో బిడ్డను కనేందుకు కూడా సిద్ధమైంది. యుకెకు చెందిన 30 ఏళ్ల మహిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.




 ఇటీవలే తన భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి వచ్చామని... అయితే తన భర్త ట్రావెలింగ్ పేరుతో తరచూ బయట తిరుగుతూ ఉంటారని..  దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై ఓ ఆత్మ  లైంగిక వాంఛ తీర్చుకోవడం మొదలు పెట్టింది అంటూ చెప్పుకొచ్చింది సదరు మహిళ. ఇక ఆ తర్వాత ఈ విషయం తన భర్తకు తెలిసి తనకు విడాకులు ఇచ్చాడని తెలిపిన మహిళ... భర్త విడాకులు ఇచ్చాడని తెలిసి ఆత్మ కూడా తనను వదిలి వెళ్ళి పోయింది అని చెప్పింది. కానీ ఆ తర్వాత మరో ఆత్మ తన తో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఇలా ఏకంగా తాను 15 ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఆత్మలతో బిడ్డను కనేందుకు ఓ  రీసెర్చ్ కూడా  చేసిందట ఈ మహిళ.



కాగా  మీరు 15 ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నట్లు మీకు ఎలా తెలుసు అవి కనిపించవు కదా అని ప్రశ్నించగా.. ఒక్కో ఆత్మతో శృంగారంలో ఒక్కో అనుభూతిని వచ్చేదని అంతేకాకుండా ప్రతి ఆత్మకు ఎనర్జీ లెవల్స్ వేరుగా ఉంటాయని.. అలా తాను 15 ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలుసుకోగలిగాను అంటూ తెలిపింది. అయితే పురుషులతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎలా అయితే అనుభూతి పొందుతానో  ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి అనుభూతి పొందాను అంటూ  చెప్పుకొచ్చింది ఆ మహిళ . ఈ మహిళ చెప్పేది అందరిని ఆశ్చర్యానికి అయోమయానికి గురి చేసింది.  మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఆమెకే తెలియాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: