అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ భారీన పడకుండా ఉండాలనే ఉద్దేశంలో చాలామంది మాస్కులు ధరిస్తున్నారు. అయితే మాస్క్ ధరించినా కరోనా సోకిందని చాలామంది చెబుతున్నారు. మాస్క్ ధరించినా కొన్ని పొరపాట్లు చేస్తే వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు ప్రజలు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే వైరస్ భారీన పడటానికి కారణమని చెబుతున్నారు. 
 
చాలామంది మాస్క్ ధరించినా మాస్కును పదేపదే తడుముకోవడం, కిందకు లాగడం, మెడపైన, తలపైన ఉంచడం చేస్తున్నారని..... ఇలా నిర్లక్ష్యం వహించడం వల్లే వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోందని చెబుతున్నారు. మరికొందరు మాస్కును తీసేస్తూ చేతులతో ముఖాన్ని తుడుచుకుంటున్నారని ఇలా చేసినా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
తెలియకుండా చేస్తున్న పొరపాట్ల వల్లే మనలో చాలామంది కరోనా వైరస్ భారీన పడుతున్నారు. నిపుణులు ఆఫీసులో ఇతరులతో మాట్లాడే సమయంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలని.... వీలైతే ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో కూడా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. మాస్కు నోరు, ముక్కును పూర్తిగా కప్పేలా ధరించకపోయినా వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 


మాస్కు ధరించిన తర్వాత మాస్కును లేదా నోరు, ముక్కును ముట్టుకోవడం అస్సలు చేయకూడదు. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. చాలామంది ఫోన్ మాట్లాడే సమయంలో మాస్క్ ను తొలగిస్తున్నారు. అలా చేసినా వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మాస్క్ ధరించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మనల్ని మనం వైరస్ సోకకుండా కాపాడుకోగలుగుతాం.                     

మరింత సమాచారం తెలుసుకోండి: