ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనా రోగుల విషయంలో తీసుకుంటున్న శ్రద్ధపట్ల ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక్కడ క్రమక్రమంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలో ప్రజలకు మానసిక స్దైర్యాన్ని అందిస్తూ, మీకు నేనున్నాను అనే భరోసాను అందిస్తున్నారు యువ సీయం జగన్.. ప్రజలకు ఇంతకంటే ఏం కావాలి. ఆపదలో ఆదుకున్నప్పుడే కదా పాలకులకు విలువ..

 

 

ఇకపోతే కరోనాకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది.. ఈ నేపధ్యంలో ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులను కరోనా సేవలు అందించేందుకు సిద్ధం చేసింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను మూడు కేటగిరీలుగా విభజించి వాటిని ప్రకటించింది.. ఇక కరోనా చికిత్సకు వెంటిలేటర్ సదుపాయంతో పాటు అన్ని సదుపాయాలు ఉండే ఆస్పత్రులను కేటగిరీ వన్‌లో ఎంపిక చేసింది. కాగా ఇందులో కేవలం 19 ఆస్పత్రులకు మాత్రమే స్థానం కల్పించింది.

 

 

ఆ ఆస్పత్రుల వివరాలు తెలుసుకుంటే.. అనంతపురం జిల్లాలో సవేరా ఆస్పత్రి, చిత్తూరు జిల్లాలోని అరగొండలో గల అపోలో, పద్మావతి మెడికల్ కాలేజీలోని ఆస్పత్రి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ అండ్ జనరల్ ఆస్ప్రతి, గుంటూరులో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌తో పాటు ఎన్ఆర్ఐ ఆస్పత్రిని కూడా చేర్చింది.

 

 

ఇవే కాకుండా కృష్ణా జిల్లా గన్నవరంలో పిన్నమనేని మెడికల్ కాలేజీ, విజయవాడలోని జీజీహెచ్, నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజీ, కర్నూలులో శాంతిరామ్ మెడికల్ కాలేజీ, ప్రకాశం జిల్లాలో కిమ్స్, శ్రీకాకుళంలో గ్రంధి మల్లిఖార్జునరావు మెడికల్ సైన్సెస్ ఆదిత్య హాస్పిటల్, విజయనగరం జిల్లాలో మిమ్స్, వైజాగ్‌లో విమ్స్, గీతమ్ మెడికల్ కాలేజీ, ఐఎన్‌హెచ్ఎస్, పశ్చిమగోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కడపలో ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ మొదలగు ఈ ఆస్పత్రులను కేటగిరీ వన్‌లో ఎంపిక చేశారు.

 

 

ఇక కరోనా రెండవ కేటగిరీ ఆస్పత్రుల వివరాలు తెలుసుకుంటే.. చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు ఆస్పత్రులతో పాటుగా, గుంటూరు, కృష్ణాలో, కర్నూలులో ఆరు ఆస్పత్రులను చేర్చారు.. ఇవేగాక ప్రకాశంలో ఐదు, నెల్లూరులో ఐదు, పశ్చిమ గోదావరిలో ఐదు, కడప జిల్లాలో ఐదు ఆస్పత్రులను కూడా రెండవ కేటగిరీలో చేర్చారు.

 

 

ఇక మూడవ కేటగిరీలో ఉన్న హస్పిటల్స్‌ను తెలుసుకుంటే.. కడప జిల్లాలో 20,  కర్నూలులో 36, నెల్లూరులో 17, చిత్తూరు జిల్లాలో 9, గుంటూరులో 51,  కృష్ణాలో 41, ప్రకాశంలో 30, తూర్పుగోదావరిలో ఒక్కటి, శ్రీకాకుళంలో 7, విశాఖపట్టణంలో 46, విజయనగరంలో 9, పశ్చిమగోదావరిలో 2, ఆస్పత్రులను కరోనా పేషెంట్స్‌కు కెటాయించారు.. ఇక ఈ కెటాయింపులు చూస్తేనే అర్ధం అవుతుంది ఏపీలోని కరోనా రోగులకు వైద్యసేవల విషయంలో అక్కడి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ద అని ప్రజలు అనుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: