ఈ మధ్యకాలంలో మహిళలను మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్న  విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి పేరుతో వలవేయటం  భారీగా డబ్బులు దండుకుని మోసం చేయడం ఇలాంటి ఘటనలు చాలానే తెర మీదకు వస్తున్నాయి. ఇక చేసేదేమీలేక బాధితులు  పోలీస్ స్టేషన్ మెట్లెక్కి న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం మహిళలకే కాదు మహిళలకు ప్రతిరూపమైన హిజ్రాలకు కూడా ఇలాంటి మోసాలే ఎదురవుతున్నాయి. ఎన్నో అవమానాలను ఎదుర్కొని సమాజంలో గర్వంగా బతకాలనుకున్నా హిజ్రాలకు.. ఏదో ఒక రూపంలో ఇబ్బందులు  ఎదురవుతూనే ఉన్నాయి.


తాజాగా ఇక్కడ ఒక ఆర్మీ జవాన్ హిజ్రా ని పెళ్లి చేసుకొని మోసం చేయడం సంచలనంగా మారిపోయింది, దీంతో  బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయ పోరాటానికి దిగింది. దీంతో ఆర్మీ జవాన్ పై కేసు నమోదయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హిజ్రా ను  మోసం చేసిన కేసులో ఆర్మీ జవాన్ మాలిక్ భాషా  పై కేసు నమోదవ్వటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... నంద్యాల మండలంలోని అభాండం తండాకు చెందిన స్వప్న అనే హిజ్రాతో సైనికోద్యోగి మాలిక్ భాషా కు  కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది,



 ఈ క్రమంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. సైనికోద్యోగి మాలిక్ భాషా  హిజ్రా ని పెళ్లి చేసుకొని తన పెద్ద మనసు చాటుకున్నాడు. కానీ ఇంతలోనే తన వక్ర బుద్ధి చూపించాడు. స్వగ్రామంలో ఇల్లు కడుతున్నారని మాయమాటలు చెప్పి హిజ్రా  నుంచి 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్లీ హిజ్రా దగ్గరికి రాలేదు. కొంతకాలం నుంచి హిజ్రా నుంచి తప్పించుకొని తిరుగుతూ వేరొక యువతిని పెళ్లి చేసుకుని ఎంతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా కాపురం చేస్తున్నాడు. దీంతో  అనుమానం వచ్చిన హిజ్రా తన భర్త కోసం గాలించగా అసలు విషయం బయటపడింది. ఇక అంతకుముందు హిజ్రాను  పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్యకు కూడా తెలియడంతో మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. ఇలా మొదటి భార్య రెండో భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: