దేశంలో కరోనా విలయతడవం చేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. దింతో కేసులను అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే అత్యవసర పని మీద ఇంటి నుండి బయటికి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. లేనిపక్షములో వారిపై జరిమానా విధిస్తున్నారు అధికారులు. అయితే మాస్కు తెచ్చిన వివాదంతో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.

 

 

బయటికి వచ్చిన సమయంలో మాస్క్ ధరించలేదంటూ ఓ కుటుంబంపై స్థానికులు జరిపిన దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో చోటు చేసుకుంది. 8 రోజుల క్రితం ఈ దాడి జరగ్గా బాధితురాలు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. 

 

 

మాస్క్‌ వేసుకోలేదని జరిగిన వివాదంలో యువతి మృతి చెందిన సంఘటన రెంటచింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెంటచింతల పిచ్చికుంట వీధిలో నివాసం ఉంటున్న కర్నాటి యలమంద వ్యక్తిగత పనులపై చెరువు సమీపంలోని వీధిలో మాస్క్‌ లేకుండా వెళ్లాడు. అక్కడున్న యువకులు మాస్క్‌ లేకుండా వచ్చినందుకు అభ్యంతరం తెలిపారు.

 

 

కొద్ది రోజుల తరువాత చెరువు సమీప వీధి యువకులు పిచ్చికుంట బజారుకు మాస్క్‌లేకుండా రావడంతో యలమంద బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈనెల 3న(శుక్రవారం) ఘర్షణ నెలకొంది. నలుగురు కర్రలతో యలమందపై దాడి చేశారు. అడ్డొచ్చిన కుమార్తె కర్నాటి ఫాతిమా(19) తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చల్లా సురేష్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: