ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఉద్దేశంతో, ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తున్నారు. ఇక 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు గానే, జిల్లాల విభజన అంశాన్ని ఇప్పుడు జగన్ తెరపైకి తెచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, జిల్లాలను విభజించ బోతున్నట్టు, ఈ మేరకు దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సొంత పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా కాస్త కంగారు పడ్డారు. ఇదిలా ఉంటే జగన్ నిర్ణయంతో టిడిపి తీవ్రంగా ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల విభజన అంశంపై చంద్రబాబు పార్టీ కీలక నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే టిడిపి ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుందని, బలమైన నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతామనే ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది.

 

ఇదే విషయమై పార్టీ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నట్ల తెలుస్తోంది. జిల్లాల విభజన ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని టీడీపీ అనుకూల జిల్లాల పరిధిలో మారిపోతాయని, టిడిపి నాయకులు అంతా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి నెల్లూరు జిల్లా ను విభజించవద్దని, విభజిస్తే కొన్ని ప్రాంతాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో కలుస్తాయి అని, మొత్తం జిల్లా రూపురేఖలు మారిపోతాయి అని మాజీమంత్ర reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇదే తరహాలో పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఇప్పుడు జగన్ జిల్లాల విభజన అమలుచేయడంలేదని, దీనిపై ప్రస్తుతం కసరత్తు మాత్రమే జరుగుతుందని, ఆ పార్టీ నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధినేత చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.

 

ఒకవేళ జిల్లాల విభజన విషయంలో జగన్ ముందుకు వెళితే కనుక దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాల విభజనకు పాల్పడితే సంస్కృతి, వారసత్వ సంపద ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ వేష భాషలు పై ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే కార్యక్రమాలు రూపొందించే విధంగా టిడిపి ప్లాన్ చేస్తుంది. మొత్తంగా జిల్లా విభజన అంశం అనేది కాక రేపేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: