తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. కొత్తగా 1,178 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 736 కేసులు గుర్తించారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటవ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 736 కేసులు నమోదవగా, రంగారెడ్డి 125, మేడ్చెల్ 101, కరీంనగర్-సిరిసిల్ల 24, రాజన్న సిరిసిల్లా 24, వరంగల్ అర్బన్ 20, మెదక్ 16, సంగారెడ్డి 13, మహబూబ్ నగర్ 12, పెద్దపల్లి 12, నల్గొండ 12, నిజామాబాద్ 12, యాదాద్రి 9, వికారాబాద్ 9, సిద్దిపేట్ 9, అదిలాబాద్ 8, సూర్యాపేట్ 7, గద్వాల్ 6, మంచిర్యాల 5, నారాయణ్ పేట్ 5, ఖమ్మం 2, జనగాం 2, వరంగల్ రూరల్ 2, జగిత్యాల 2, వనపర్తి 2, ఆసిఫాబాద్ 1గా పాజిటివ్  కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 33,402కు పెరిగింది.

 

ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య నానానటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరోనా గురించిన భయాందోళనలకు గురి కావొద్దని  వెల్లడించారు.  కరోనాపై ఈ మద్య లేని పోని పుకార్లు వస్తున్నాయని.. కొంత మంది క్యాష్ చేసుకోవడానికి ప్రజలను భయపెడుతున్నారని అన్నారు.  

 

సిద్ది పేట ప్రజలు కరోనా గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదని.. జిల్లా ఆసుపత్రిలో వున్న ఐసోలేషన్‌కు అదనంగా స్థానిక ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో 100 పడకల కరోనా వార్డును ఈనెల 15న ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యంపై ఏమాత్రం అనుమానం ఉన్నా..స్థానిక పీహెచ్‌సీలో సంప్రదించాలని కోరారు. ఆసుపత్రిలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే అన్ని రకాల ఆహార పదార్ధాలు అందిస్తామని స్పష్టంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: