నువ్వు ఎంతగా నేలకేసి కొడితే నేను అంతగా పైకి లేస్తా అంటుంది బంతి.. ఇప్పుడు కరోనా కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది.. ఈ వైరస్ విషయంలో ఎన్ని చర్యలు చేపట్టినా అంతకంతకు విజృంభిస్తుందే గానీ వెనక్కు తగ్గడం లేదు.. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ద డిసెంబర్ నాటికి కరోనా మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరికలు జారిచేస్తున్నారు.. వీరి హెచ్చరికలకు తగ్గట్లుగానే ఈ వైరస్ కూడా ముందుకు వెళ్ళుతుంది గానీ వెనకడుగు వేయడం లేదు..

 

 

ఇక ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో కరోనా విస్తృతి ఏ స్దాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే.. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు బల్దియా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కమిషనర్ లోకేశ్ కుమార్, సర్కిళ్లకు స్పెషల్ అధికారులను నియమించారు. ఈ అధికారులు ఆయా ప్రాంతాల్లో కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారని పేర్కొన్నారు.. అదీగాక ఆయా జోన్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలను క్షేత్రస్థాయిలో సదరు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారట..

 

 

ఇప్పటికే కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న సమయంలో, తెరవెనక ఏం జరిగిందో తెలియదు గాని ఇప్పుడిప్పుడే అధికారుల్లో మళ్లీ చలనం మొదలైందని ప్రజలు అనుకుంటున్నారట.. అందుకే జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారని అభిప్రాయపడుతున్నారు.. ఇదిలా ఉండగా ఈ ప్రత్యేక అధికారులు కరోనా కేసులు ఎక్కువ వచ్చిన ప్రాంతాలపై దృష్టి సారించి, అక్కడి పరిస్దితులను అంచనా వేస్తూ, కరోనా కట్టడికి కావలసిన చర్యలు తీసుకుంటారు.

 

 

ఇక పాజిటివ్ వ్యక్తులతో పాటు సర్కిళ్లలో ఇతర సేవలు అవసరమైన ప్రజలు కూడా సదరు నోడల్ అధికారుల ద్వారా తగిన సహాయాన్ని పొందేందుకు అవకాశం ఉందని, ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని, ఐఏఎస్ అధికారులను నేరుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసే ప్రయోగాన్ని చేపడుతున్నట్టు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి వివరించారు.

 

 

ఇకపోతే జీహెచ్ఎంసీ ప్రకటించిన నోడల్ అధికారుల వివరాలు జోన్ వారిగా చూస్తే.. ఖైరతాబాద్, మెహదీపట్నం పరిధిలో శంకరయ్య 9866514545.. ఖైరతాబాద్, కార్వాన్ పరిధిలో సంధ్య 9154114997. చార్మినార్, చాంద్రాయణగుట్టలో విజయలక్ష్మి 9849165982, రాహుల్ రాజ్ 9154156689.. చార్మినార్ నుండి రాజేంద్రనగర్ వరకు బడావత్ సంతోష్ 9963614041.. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో ప్రియాంక అల 9154156671.. సికింద్రాబాద్, అంబర్ పేట జయరాజ్ కెన్నడీ 9849911735.. శేరిలింగంపల్లి, యూసఫ్‌గూడ పరిధిలో ఎన్.యాదగిరి 9704405335.. గా ప్రకటించారు.. ఈ పరిధిలో ఉన్న ప్రజలు కరోనా విషయంలో వీరిని సంప్రదించి సహాయసహకారాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: