దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వైద్య నిపుణులు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా వైరస్ దరి చేరదని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. వైరస్ భారీన పడకుండా ఉండాలంటే వ్యాయామం, యోగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. 
 
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శరీరానికి ఎండ తగిలేలా జాగ్రత్త పడాలి. ప్రతిరోజూ నువ్వుల నూనెను కొంత సమయం వేడి చేసి గోరువెచ్చని నూనెను రెండు నాసికా రంధ్రాల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
ఇంట్లో ప్రతిరోజూ వేపాకులు సాంబ్రాణి పొగ వేస్తూ ఉండాలి. అలా చేస్తే గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ ను నిరోధించడం సాధ్యమవుతుంది. వంటల్లో ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్రలను ఎక్కువగా వినియోగించాలి. ఇవి జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడతాయి. స్వీట్లు, కూల్ డ్రింక్స్, పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. ఆహారం చల్లారిన తరువాత తినడం కంటే వేడిగా ఉన్న సమయంలో తినడం ఉత్తమం. 
 
రాత్రి భోజనం ఎనిమిది గంటల లోపే పూర్తి చేయాలి. ఆహారం తిన్న రెండు గంటల తరువాత నిద్రించాలి. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, లవంగం, మిరియాల పొడిలను కప్పు నీటిలో వేసి మరిగించి... అందులో తేనె లేదా బెల్లం వేసుకుని వేడిగా తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగితే కరోనా లాంటి వైరస్ ల భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.           

మరింత సమాచారం తెలుసుకోండి: