గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం గుర్తున్నాడు క‌దా? అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డి, దారుణాల‌కు ఒడిగ‌ట్టి పోలీసుల చేతిలో ఎన్‌కౌంట‌ర్‌కు గుర‌య్యాడు. ఆయ‌న‌కు సంబంధించిన వంద‌ల కోట్ల అక్ర‌మ సంపాద‌న ఏమైంద‌నే ప్ర‌శ్న ఇప్ప‌టివ‌ర‌కూ అలాగే ఉండిపోయింది. ఈ విష‌యంలో ఇలా ఉంచితే, తాజాగా యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. కాన్పూర్‌ సమీపంలో భైరవ్‌ఘాట్‌లో వికాస్‌ దూబే అంత్యక్రియలు జరిగాయి. విద్యుత్‌ దహనవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. దీనికి వికాస్‌ భార్య రిచా, అతని కుమారుడు, రిచా సోదరుడు దినేశ్‌ తివారీ మాత్రమే హాజరయ్యారు.

 

అంత్య‌క్రియ‌ల సందర్భంగా మీడియా ప్రతినిధులు గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై దూబే తండ్రి రామ్‌ కుమార్‌ కూడా పోలీసుల చర్యను సమర్థించారు. వికాస్ దూబే త‌ల్లిదండ్రులతో పాటుగా ఆయ‌న భార్య సైతం అదే రీతిలో రియాక్ట‌య్యారు. దూబే భార్య రిచా స్పంద‌న కోర‌గా, ఆమె ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తన భర్త తప్పు చేశాడని, పోలీసుల చేతిలో చావడానికి అతడు అర్హుడేనని రిచా అన్నారు. ‘అవును నా భర్త తప్పు చేశాడు. చావుకు అర్హుడే’ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా, రిచా మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వల్లే తన భర్తకు ఆ గతి పట్టిందన్నారు. 

 

ఇదిలా ఉండగా వికాస్‌ దూబే ముఖ్య అనుచరుడు గుడ్డాన్‌ రామ్‌ విలాస్‌ త్రివేదిని(46) ముంబై ఏటీఎస్‌ పోలీసులు థానే సమీపంలో అరెస్టు చేశారు. అతనితో పాటు డ్రైవర్‌ సోను తివారీని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిక్రూలో పోలీసులను చంపిన తర్వాత వారు ముంబైకి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని శనివారం అరెస్టు చేశారు. కాగా, న‌యీం భార్య సైతం త‌న భ‌ర్త ఎన్‌కౌంట‌ర్ విష‌యంలో పోలీసుల తీరును త‌ప్పుప‌ట్టిన‌ట్లు, అదే స‌మ‌యంలో ఆయ‌న అక్ర‌మాల‌ను కొన‌సాగించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: