దేశంలో కరోనా వైరస్ విజృభింస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే కరోనాను కొంత మేరకు అయినా అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ కారణంగా చిన్న పిల్లల నుండి పేద వారిదాకా అందరు ఫోన్ కి పరిమతమైయ్యారు. పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఫోన్ కి చాల అట్ట్రాక్ట్ అయ్యారు. అయితే తాజాగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

 

 

ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన రూ.15 లక్షలు కోల్పోయాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నానన్న బాధతో పాటు, తల్లిదండ్రులను అప్పుల పాటు చేశానన్న ఆవేదనతో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటు చేసుకుంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన తోట మధూకర్(24) హైదరాబాద్‌‌లో బీటెక్ చదువుతున్నారు. 

 


అయితే అతడు కొంతకాలంగా ‘డఫ్పా బెట్‌’ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ దానికి బానిసగా మారాడు. దీంతో తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు ఫ్రెండ్స్, బంధువుల వద్ద సుమారు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి గేమ్‌లో కోల్పోయాడు. తన తీరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడిందని మధూకర్ తీవ్రంగా బాధపడ్డాడు. ఈ నెల 7న ఉదయం ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకురావాలని తండ్రి చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మధూకర్ తిరిగి రాలేదన్నారు.

 


అయితే అదే రోజు చింతపల్లి గ్రామంలో ఉండే తన అక్క మౌనికకు తాను మంచిర్యాలలో పురుగుల మందు తాగినట్లు సెల్‌ఫోన్‌కు సందేశం పంపారు. మౌనిక వెంటనే తన తండ్రికి సమాచారం ఇవ్వడంతో వారు మంచిర్యాలకి వెళ్లారు. మధూకర్‌ను కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధూకర్ శనివారం సాయంత్రం మృతి చెందారు. తండ్రి శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: