కరోనా ఏపీలోనూ విజృంభిస్తోంది. ప్రత్యేకించి రాయలసీమలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. అందులోనూ అనంతపురం జిల్లా అయితే మరీ ఎక్కువ.. ఈ జిల్లాలో మార్చి 29న మొదలైన వైరస్ అలజడి ఇప్పుడు జిల్లా నలుమూలకూ వ్యాపించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోనే అత్యధికంగా 311 మంది  వైరస్‌బారిన పడ్డారు. 

 

IHG


కొత్త కేసుల్లో  161 మంది  అనంతపురంకు చెందిన వారు ఉన్నారు. మార్చి 29న లేపాక్షి మండలంలో పదేళ్ల చిన్నారికి వైరస్ సోకిందని గుర్తించినది మొదలు రోజూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది, వందల సంఖ్యలో పోలీసులు, పదిమంది వరకు మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు.

 

IHG


ఈ జిల్లాలో ఉన్న 2 ప్రయోగశాలల్లో రోజూ రెండు వేల నమూనాలను పరీక్షిస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నాఅనంతపురం జిల్లాలో వ్యాప్తి ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో కరోనా రోగుల సంఖ్యకు తగినంతగా పడకలు లేవు. కొత్త రోగుల కోసం పాత రోగులను వారం, పది రోజులకే ఇంటికి పంపుతున్నారు.  

 

IHG


ఈ నెల 15 తర్వాత రోజువారీ రోగుల సంఖ్య 5 వందల వరకు వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు అధికారులను హెచ్చరిస్తున్నారు. మరి అదే జరిగితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏమో.. ? 

మరింత సమాచారం తెలుసుకోండి: