కరోనా మహమ్మారి ఇప్పటికే అన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కి వ్యాక్సిన్ , చికిత్స వైద్య పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా మందు రాలేదని కూడా తెలిసిన విషయమే.  కొన్ని వ్యాక్సిన్స్  క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ చికిత్సకు కొన్ని యాంటీ వైరస్ లు సహకరిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ కి ఔషదాలు లేక పోవడంతో యాంటీ వైరల్ ఔషధాలని వినియోగిస్తున్నారు. వీటిలో రెమిడిసివిర్ కూడా ఇవ్వచ్చు అని సూచించారు.

 

అయితే ఈ మేరకు దేశంలో కేవలం నాలుగు రోజుల్లోనే లక్షకు పైగా కొత్త కేసు నమోదయిన సంగతి ఐసీఎంఆర్ గుర్తించింది.  రెమిడిసివిర్ ను రోగులకు ఇవ్వడం వల్ల కొన్ని తీవ్ర సమస్యలు రావచ్చు అని చెప్పింది. దీని వల్ల కాలేయం, మూత్ర పిండాల వైఫల్యం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు అని చెప్పింది.  అయితే అన్ని సందర్భాల్లో దీనిని ఉపయోగించడం మంచిది కాదని కేవలం అత్యవసరం అయితే దీన్ని వాడమని చెప్పింది.

 

రెమిడిసివిర్ టోసిలిజుమాబ్ వంటివి అత్యవసరమైతే వినియోగించాలి లేకపోతే వాడడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ ఉంటుందని చెప్పింది. దీని ప్రభావం సైటోకైన్‌ పైన పడుతుందని అందుకే వాడకాన్ని తగ్గించాలని చెప్పింది. అయితే మన దేశంలో గత 24 గంటల వ్యవధిలో 29,435 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.50 లక్షల దాటింది. అయితే తాజాగా మరో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 22,696 చేరింది.  కరోనా వైరస్ కు సమర్థవంతమైన చికిత్స అనుసరించడం వల్ల క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ లో భాగంగానే కొన్ని ఔషధాలను కూడా సూచించారు కాకపోతే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వీటికి ఇంకా అనుమతి ఇవ్వలేదు

 

మరింత సమాచారం తెలుసుకోండి: