మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరూ. కొన్ని అంశాల్లో  ఒకటి అనుకుంటే ఇంకొకటి  జరుగుతుంది,. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కరోనా  వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటుంది కరోనా .దీంతో  ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈ మహమ్మారి వైరస్ సోకి ఆస్పత్రి పాలై ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోతున్న వారూ చాలా మంది. ఇక్కడ ఒక యువకుడికి కరోనా  వైరస్ సోకింది.


 జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ యువకుడు కరోనా  వైరస్ బారిన పడ్డాడు. అయితే కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ఆందోళన చెందకుండా... ఎంతో ధైర్యంగా కరోనా  వైరస్ ఎదురుకున్నాడు. అతని ధైర్యం ముందు ప్రాణాంతకమైన కరోనా  వైరస్ కూడా చిన్నబోయింది . ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా  వైరస్ అతని ప్రాణాలు మాత్రం తీయలేకపోయింది. కరోనా  వైరస్ చికిత్స తీసుకుని కోలుకున్నాడు  కానీ చివరికి మృత్యువు ఒడిలోకి చేరాడు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ విధివంచించి  యువకుడు మృత్యువాత పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.   మెదక్ జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడు దురదృష్టవశాత్తు కరోనా వైరస్ బారిన పడ్డాడు.



అయినప్పటికీ మనస్తాపం చెందకుండా  ధైర్యంతో కరోనా  వైరస్ తో పోరాడాడు. చికిత్స తీసుకొని కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. ఎంతో ఆనందంతో ఇంటికి బయలు దేరిన ఆ యువకుడు ఆనందాన్ని చూసి విధి వక్రించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కరోనా వైరస్ పై గెలిచినప్పటికీ యాక్సిడెంట్ రూపంలో అతనికి కాలం మృత్యువు దరిచేరేలా  చేసింది. ఈ విషాద ఘటన తో గ్రామం  మొత్తం మూగబోయింది..

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: