తాజాగా దంపతులు బ్యాంక్ కి వెళ్లారు. వాళ్లకి  షాక్ తగిలింది. అయితే అసలు ఏం జరిగింది ? తమిళనాడు లోని నాగపట్నం జిల్లా లో ఓ మహిళ తమ కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచింది వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో  పెట్టి ఇంటి వెనక పాతిపెట్టింది. అయితే ఆ నోట్లు రద్దు అయిన రూపాయలు 500 రూపాయలు 1000 నోట్లు అని తేలడం తో కుటుంబం మొత్తుకుంటున్నా ఫలితం లేక పోయింది. అయితే వాళ్ళది  చాలా పేద కుటుంబం. వాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా దాచిపెట్టారు .

 

ప్లాస్టిక్ కవర్లో మూట కట్టి ఇంటి వెనక గొయ్యి తీసి పాతి పెట్టారు. బాధితురాలైన తమ కుమార్తె పెళ్లి కోసం ఆ డబ్బును భద్రంగా దాచి పెట్టినట్లు ఆమె తెలిపింది. ప్రభుత్వం ఇటీవలే వాళ్లకి ఇల్లు మంజూరు చేసింది అయితే కూలీలు తవ్వుతుండగా ఆ ప్లాస్టిక్ మూట బయటకొచ్చింది ఆ డబ్బంతా తను కూడ పెట్టింది అని చెప్పింది. అయితే ఇప్పుడు వాటిని తమ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేద్దామని వెళితే అక్కడ అధికారులు చెప్పిన మాటలకి కంగుతిన్నారు . ఎందుకు అంటే అవి నాలుగేళ్ల కిందట రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు, ఐదు వందల  నోట్లు.

 

వాటి విలువ మొత్తం ముప్పై ఐదు  వేల ఐదు వందలు ఉన్నాయి . అవి బ్యాన్ చేసారని  తెలియడం తో వాళ్లు నిరాశ చెందారు . నాగ పట్టణం జిల్లా కొళ్లిడం సమీపంలోని పట్టియమేడుకు చెందిన రాజదురై, ఉష దంపతులు  చదువుకోలేదు. ఆమె కూలి పనులు చేసుకుంటూ కుమార్తె వివాహం కోసం డబ్బు దాచింది. ఈ రద్దయిన విషయం వాళ్ళకి తెలియదని మొత్తుకుంటున్నా ఫలితం లేక పోయింది. అయితే తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: