గతంలో తన ప్రభుత్వాన్ని విమర్శస్తే.. వారికి కరోనా వస్తదంటూ కేసీఆర్ శపించారు.. బహిరంగంగా ప్రెస్ మీట్‌లోనే కేసీఆర్ ఈ కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు అదే శాపం వికటించిందట. ఆ కరోనా భయంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ వదిలిపెట్టి ఫామ్ హౌస్‌కు పరారయ్యారట. ఈ విషయంలో సోషల్ మీడియాలో బాగానే సెటైర్లు పడుతున్నాయి. కానీ.. ఓ మెయిన్‌ స్ట్రీమ్ ప్రింట్ మీడియాలో ఇలాంటి కామెంట్లు రాలేదు. 

 

 


మరి ఇప్పుడు రాసిందెవరంటారా.. ఇంకెవరూ దమ్మున్న మీడియా ఉందిగా.. అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఆదివారం తన కొత్త పలుకు శీర్షికలో ఏబీఎన్ ఆర్కే కేసీఆర్‌నే టార్గెట్ చేశారు. ఇంతకూ ఆర్కే ఏమంటున్నారంటే.. “ రెండు వారాలపాటు ప్రజలకు కనపడకుండా, వినపడకుండా ఫామ్‌హౌస్‌లో గడిపిన వైనం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన ఆరోగ్యంపై వదంతులు షికార్లు చేశాయి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా తన భద్రత తాను చూసుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి. ప్రగతి భవన్‌లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందికి కరోనా సోకడంతో కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో గడిపార"ని కామెంట్ చేశారు. 

 


కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దశలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి కరోనా సోకాలని శపించిన పెద్దమనిషి ఇప్పుడు అదే కరోనాకు భయపడి శనివారం దాకా ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఆర్కే కామెంట్ చేశారు.  ఆరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, ప్రారంభంలో మినహాయించి సచివాలయం ముఖం చూడని కేసీఆర్... ఇప్పుడు అద్భుతమైన సచివాలయాన్ని కడతానని చెబుతున్నారన్నారు. 

 

 

సామాన్య ప్రజలకు దర్శనం కూడా ఇవ్వకుండా ప్రగతి భవన్‌కే పరిమితమైన ఆయన తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని బలంగా నమ్ముతున్నారని.. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయనలో అటువంటి అతి విశ్వాసం ఏర్పడడానికి కారణం అవుతున్నాయని..  రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో కేసీఆర్‌కు చెక్‌ పెట్టేవాళ్లు లేకుండాపోయారని ఆర్కే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: