అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై మరియు కార్యకర్తలపై వివిధ కారణాలు చూపి పోలీసు కేసులు పెట్టడంతో టీడీపీ క్యాడర్ ఎక్కువగా ప్రశ్నించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. చాలావరకు కేడర్ ని అధికార పార్టీ వేధింపులకు గురి చేస్తుందని అక్రమ కేసులలో ఇరికిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వంపై పోరాటం కోసం అధిష్టానం పిలుపు ఇస్తున్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి భయం పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. మరోపక్క మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులను వివిధ కేసుల్లో ఇరుక్కునేలా జైలు పాలు కావటం మరియు కోర్టు చుట్టూ తిరగడంతో తదితర కారణాలతో మిగతా పార్టీ కేడర్ లో కూడా ప్రభుత్వంపై ప్రశ్నించడానికి భయాందోళన కలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడాలని ఎంత పిలుపునిచ్చినా సరైన రెస్పాన్స్ కింది స్థాయి నుండి రాకపోవటంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టినట్లు టీడీపీ అధిష్టానం గుర్తించింది. దీంతో ఇప్పటి వరకు అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు ఓ స్థాయిలో పార్టీ పరంగా అధిష్టానం న్యాయ సహాయం చేయడం జరిగింది.

 

అయితే రాబోయే రోజుల్లో కిందిస్థాయి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందేలా పార్టీలో కొత్త లీగల్ సెల్ కార్యకర్తల కోసం చంద్రబాబు ఏర్పాటు చేయనున్నట్లు దీంట్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎక్కడ అయినా అక్రమ కేసులు పెడితే వారి తరఫున పార్టీ నాయ పోరాటం చేయడానికి చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్నారు అట. దీంతో ఈ వార్త తెలుసుకుని టీడీపీ క్యాడర్ ఫుల్ హ్యాపీ లో ఉన్నట్లు ప్రభుత్వం పై ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల అక్రమంగా కేసులలో ఇరుక్కుపోయిన పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తో మరింత ధైర్యం కార్యకర్తలలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: