కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ధనిక దేశాలలో కూడా ఆకలి కేకలు వినబడుతున్నాయి. పూర్తిగా ప్రపంచ మార్కెట్ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా పడిపోవడంతో వివిధ ప్రముఖ రంగాలపై చాలా ఎఫెక్ట్ పడింది. వాటిలో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంకి ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. దీంతో నష్టాలను పూరించేందుకు బడా కంపెనీలు రాయితీలు బ్యాంకింగ్ సెక్టార్ నుండి సహకారం అందిస్తున్న చిన్న చిన్న బిల్డర్లకు మాత్రం ఎలాంటి సాయం అందటం లేదు. అతి తక్కువ టైమ్ లోనే ఇన్వెస్టర్లను కోట్లకు పడగలెతించే ఈ రంగం పై మహమ్మారి కరోనా ప్రభావం పడటంతో లక్షల కోట్లలో జరిగే వ్యాపారం లాక్ డౌన్ వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది.

IHG

కన్స్ట్రక్షన్ కి అనుమతులు ఇచ్చిన కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వ నిర్ణయాలలో మార్పులు చేర్పులు ఉన్న కొద్దీ మారిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లలో మరియు డెవలపర్ల లో ఆందోళన నెలకొంది. ఏలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని విధంగా దేశంలో కరోనా వ్యాప్తి ఉండటంతో చాలావరకూ రియల్ ఎస్టేట్ రంగం దేశంలో పడిపోయింది.

IHG

కరోనా ఎఫెక్ట్ తో సిమెంటు మరియు ఇటుక అదేవిధంగా స్టీల్ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇటువంటి తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు అందించాలని కోరుతున్నారు. దీంతో అనుకున్న దానికంటే టైం ఎక్కువ పడితే ఇన్వెస్టర్ల పై భారం పడే పరిస్థితిలో ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభమైన గానీ మునుపటిలాగా పనులు జరగడం లేదని తమ బాధను వెళ్లబోసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: